Begin typing your search above and press return to search.

నో డైరెక్ష‌న్ ఓన్లీ యాక్ష‌న్‌.. ఇదే బాగుందా?

ఒక ద‌శ‌లో సూప‌ర్ హిట్ సినిమాల‌ని అందించిన ద‌ర్శ‌కులు ఇప్పుడు యాక్ష‌న్ క‌ట్ అన‌డం ప‌క్క‌న పెట్టి ఓన్లీ యాక్ష‌న్ జ‌పం చేస్తున్నారు.

By:  Tupaki Entertainment Desk   |   7 Jan 2026 10:00 PM IST
నో డైరెక్ష‌న్ ఓన్లీ యాక్ష‌న్‌.. ఇదే బాగుందా?
X

ఒక ద‌శ‌లో సూప‌ర్ హిట్ సినిమాల‌ని అందించిన ద‌ర్శ‌కులు ఇప్పుడు యాక్ష‌న్ క‌ట్ అన‌డం ప‌క్క‌న పెట్టి ఓన్లీ యాక్ష‌న్ జ‌పం చేస్తున్నారు. అలా చేసిన సినిమాలు స‌క్సెస్ అవుతుండ‌టం, డైరెక్ష‌న్‌కు మించిన రిలీఫ్ ఇస్తుండ‌టంతో చాలా వ‌ర‌కు యంగ్ డైరెక్ట‌ర్స్ యాక్ట‌ర్స్‌గా మారిపోతున్నారు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌, `టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్ట‌ర్ అభిషిన్ జీవింత్, త్వ‌ర‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా హీరోగా అరంగేట్రం చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా మారి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని అందిస్తూ అంద‌రిలో ఆలోచ‌న రేకెత్తిస్తున్నాడు.

ఇదే బాటలో ఇప్పుడు `టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్ట‌ర్ అభిషిన్ జీవింత్, త్వ‌ర‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా హీరోలుగా మారుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. `టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్ట‌ర్ అభిషిన్ జీవింత్ `విత్ ల‌వ్‌` మూవీతో హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇక యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ల స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్న లోకేష్ క‌న‌గ‌రాజ్ ..అరుణ్ మాథేశ్వ‌ర‌న్ డైరెక్ట్ చేయ‌బోతున్న సినిమాతో హీరోగా మార‌బోతున్నాడు. వీరి త‌ర‌హాలోనే మ‌న టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ కూడా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. త‌నే త‌రుణ్ భాస్క‌ర్‌.

`పెళ్లి చూపులు` సినిమాతో డైరెక్ట‌ర్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన త‌రుణ్ భాస్క‌ర్ ఆ త‌రువాత త‌న ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోతున్నాడు. వెంక‌టేష్‌తో సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగినా అది కార్య‌రూపం దాల్చ‌క‌పోవ‌డంతో హీరోగా న‌టించ‌డం మొద‌లు పెట్టాడు. రెండేళ్ల క్రితం `కీడాకోలా` చేసిన త‌రుణ్ భాస్క‌ర్ అప్ప‌టి నుంచి డైరెక్ష‌న్ ఊసే ఎత్త‌డం లేదు. నో డైరెక్ష‌న్ ఓన్లీ యాక్ష‌న్ అంటూ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా `ఇడుపు కాయితం` సినిమా అనుకున్నారు కానీ అది చేతుల మారింది.

ఇప్పుడు `ఓం శాంతి శాంతి శాంతి:`తో హీరోగా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. ఇషా రెబ్బ హీరోయిన్‌. ఏఆర్ స‌జీవ్ ద‌ర్శ‌కుడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. జ‌న‌వ‌రి 23న థియేట‌ర్లలోకి రాబోతోంది. మ‌ల‌యాళ న‌టుడు, డైరెక్ట‌ర్ బాసిల్ జోసెఫ్ న‌టించిన `జ‌య జ‌య య జ‌య‌హే`కు రీమేక్‌గా దీన్ని రూపొందించారు. మ‌ల‌యాళ మూవీ అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో తెలుగులోనూ అదే స‌క్సెస్ రిపీట్ అవుతుంద‌ని త‌రుణ్ భాస్క‌ర్ భావిస్తున్నాడ‌ట‌.

అనుకున్న‌ట్టుగా స‌క్సెస్ అయితే మ‌రిన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు త‌రుణ్ భాస్క‌ర్ శ్రీ‌కారం చుట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. డైరెక్ష‌న్ ప‌క్క‌న పెట్టి యాక్ష‌న్ కు దిగ‌డంతో ఇదే త‌న‌కు హాయిగా ఉందా? అందుకే డైరెక్ష‌న్ వైపు ఆలోచించ‌డం లేదా? అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు మంచి టైమ్ న‌డుస్తున్న నేప‌థ్యంలో త‌రుణ్ భాస్క‌ర్ త‌న ఒరిజిన‌ల్ ఆలోచ‌న‌ల‌తో హీరోగా కంటిన్యూ అవుతూనే డైరెక్ట‌ర్‌గా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయాల‌ని అంతా కోరుకుంటున్నారు.