ఈషాతో డేటింగ్.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా - తరుణ్ భాస్కర్
ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఈషా రెబ్బాతో డేటింగ్ లో ఉన్నట్లు పలు రకాల కథనాలు వెలువడుతున్నాయి.
By: Madhu Reddy | 27 Jan 2026 5:45 PM IST2016లో విజయ్ దేవరకొండను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం 'పెళ్లి చూపులు'. ఈ సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు తరుణ్ భాస్కర్ దాస్యం. ఈ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాకుండా ఉత్తమ మాటల రచయితగా కూడా ఈయనకు నేషనల్ అవార్డు లభించింది. ఈ సినిమా తర్వాత దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. 2019లో 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన తరుణ్ భాస్కర్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే చిత్రంలో అతిథి పాత్ర కూడా పోషించారు.చివరిగా 2023లో 'కీడా కోలా' అనే చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా అందులో నటించాడు కూడా. అలాంటి ఈయన 2024లో మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా అనే చిత్రంలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అలాంటి ఈయన తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః'.. మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జయ జయ జయ జయహే' చిత్రానికి రీమేక్ కావడం గమనార్హం. ఈషా రెబ్బ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా జనవరి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న చిత్ర బృందం సినిమా గురించి పలు విషయాలు పంచుకున్న విషయం తెలిసిందే.మరోవైపు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ సందడి చేస్తున్న తరుణ్ భాస్కర్ గత కొంతకాలంగా ఈషా రెబ్బాతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రాగా దానిపై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఈషా రెబ్బాతో డేటింగ్ లో ఉన్నట్లు పలు రకాల కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై మీ సమాధానం ఏమిటి ?అంటూ హోస్ట్ ప్రశ్నించగా.. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. "ఈషా రెబ్బ నాకు ఫ్రెండ్ కంటే చాలా ఎక్కువ. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. గత నాలుగు సంవత్సరాలుగా నాకు అన్ని విషయాలలో తోడుగా నిలిచింది. ఇందులో చెప్పడానికి కానీ దాచడానికి కానీ ఏమీ లేదు. అయితే వ్యక్తిగత విషయం కాబట్టి అనౌన్స్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు చెబితే అది వేరే వాళ్లను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ టైంలో అనౌన్స్మెంట్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. బర్రె తోలు మీద వాన పడినట్టు మనకేం ఇబ్బంది ఉండదు కానీ ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగకూడదు కదా. కానీ ఖచ్చితంగా దేవుడి దయతో అన్నింటికీ చెక్ పెడుతూ త్వరలోనే క్లారిటీ ఇస్తాను" అంటూ తరుణ్ భాస్కర్ తెలిపారు.
అయితే ఇద్దరి రిలేషన్ గురించి కన్ఫర్మ్ చేస్తారా? లేక రూమర్స్ అని కొట్టి పారేస్తారా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ తరుణ్ భాస్కర్ మాటలు విన్న నెటిజన్స్ మాత్రం ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అంటూ కామెంట్లు చేశారు.
అయితే ఇదే విషయంపై అటు ఈషా రెబ్బ కూడా స్పందించింది. తరుణ్ భాస్కర్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలను ఖండించింది." ప్రస్తుతం నేను డేటింగ్ లో ఉన్నాను. అయితే ఆ డేటింగ్ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనల వరకు వెళ్లలేదు" అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి ఈమె తరుణ్ భాస్కర్ తో డేటింగ్ లో ఉందా లేక మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఏది ఏమైనా వీరు చేసిన కామెంట్లకు నెటిజన్లు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
