Begin typing your search above and press return to search.

తరుణ్ భాస్కర్ 'ఓం శాంతి శాంతి శాంతిః'.. మామూలు ఫన్ కాదు ఇది!

ఈ నేపథ్యంలో తాజాగా ఓం శాంతి శాంతి శాంతిః టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం టీజర్ అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.

By:  M Prashanth   |   8 Dec 2025 10:30 PM IST
తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి శాంతిః.. మామూలు ఫన్ కాదు ఇది!
X

టాలీవుడ్ సెలబ్రిటీ తరుణ్ భాస్కర్ ధాస్యం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే రైటర్ గా, డైరెక్టర్ గా, నటుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. పెళ్లి చూపులు మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా వంటి పలు చిత్రాలతో యూత్ కు ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయారని చెప్పాలి.

అటు దర్శకుడిగా సినిమాలు తీస్తూనే.. ఇటు సినిమాల్లో నటిస్తున్న తరుణ్ భాస్కర్.. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓం శాంతి శాంతి శాంతిః మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ చిత్రంలో లీడ్ రోల్ లో తరుణ్ భాస్కర్ నటిస్తుండగా.. ఆయన సరసన టాలెంటెడ్ బ్యూటీ ఈషా రెబ్బా యాక్ట్ చేస్తున్నారు. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ అరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, నవీన్ శనివరపు సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమా.. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్‌ మూవీ జయజయ జయహేకు రీమేక్‌ గా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. వచ్చే ఏడాది జనవరి 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓం శాంతి శాంతి శాంతిః టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం టీజర్ అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. ఆడియన్స్ ను ఫుల్ గా నవ్విస్తుంది చెప్పాలి. తెలుగు నేటివిటీకి తగ్గట్లు గోదావరి బ్యాక్ డ్రాప్‌ లో మూవీ అంతా ఉండనుందని టీజర్ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

ముఖ్యంగా ఓం శాంతి శాంతి శాంతిః టీజర్.. సినిమాలో తరుణ్ భాస్కర్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తోంది. మాటల కంటే చూపులతోనే భావాలు వ్యక్తం చేసే ఆయన యాక్టింగ్ టీజర్‌ లో ప్రధాన హైలైట్‌ గా నిలిచింది. కథలోని మిస్టరీపై ఆసక్తిని పెంచే విధంగా విజువల్స్ చూపించారు మేకర్స్. గృహిణి పాత్రలో ఈషా రెబ్బా ఆకట్టుకున్నారు.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. తరుణ్ భాస్కర్ కామిక్ టైమింగ్ అదిరిపోయింది. ఈషా రెబ్బాతో ఆయన కెమిస్ట్రీ.. ఆకట్టుకునేలా ఉంది. జై క్రిష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. టీజర్ లోని డైలాగ్స్.. సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. మరి ఓం శాంతి శాంతి శాంతిః మూవీ ఎలా మెప్పిస్తుందో.. ఎలాంటి హిట్ గా నిలుస్తుందో వేచి చూడాలి.