Begin typing your search above and press return to search.

తరుణ్- ఈషా సంగతేంటి? ఎప్పుడు చెప్తారో మరి?

సెన్సేషనల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, టాలెంటెడ్ హీరోయిన్ ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి.

By:  M Prashanth   |   25 Feb 2026 10:00 PM IST
తరుణ్- ఈషా సంగతేంటి? ఎప్పుడు చెప్తారో మరి?
X

సెన్సేషనల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, టాలెంటెడ్ హీరోయిన్ ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి. ఇద్దరూ కలిసి కనిపించిన లేటెస్ట్ పిక్స్.. ఆ వార్తలకు మరింత బలం చేకూరుతున్నాయి. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఎప్పుడు క్లారిటీ ఇస్తారోనని మాట్లాడుకుంటున్నారు.

నిజానికి.. రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్ లో ప్రస్తుతం అనేక మంది సినీ ప్రముఖులు సందడి చేస్తున్నారు! స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ వేడుకలు అక్కడ ఘనంగా జరుగుతున్నాయి. ఆ గ్రాండ్ వెడ్డింగ్ కు వేదిక అయిన మెమెంటోస్ బై ఐటీసీ హోటల్ వద్దకు సినీ తారలు, సన్నిహితులు ఇప్పటికే చేరుకున్నారు.

విరోష్ వెడ్డింగ్ కు తరుణ్ భాస్కర్ హాజరవుతారని ముందే తెలిసినా, ఆయనతో పాటు ఈషా రెబ్బా కూడా కలిసి ఉదయ్‌ పూర్‌ చేరుకోవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరూ ఎయిర్‌ పోర్ట్‌ లో కలిసి కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. నెటిజన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట, ఇప్పుడు విరోష్ పెళ్లికి కలిసి వచ్చారంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా ఆ జంటపై రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని టాక్ నడుస్తోంది. ఇటీవల ఇద్దరూ కలిసి యాక్ట్ చేసిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమా ప్రమోషన్స్‌ లో కూడా వీరి మధ్య ఉన్న కంఫర్ట్, కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పుడే ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

డేటింగ్‌ పై వచ్చిన ప్రశ్నకు ఈషా రెబ్బా తెలివిగా స్పందిస్తూ, ఏదైనా ఉంటే తానే చెబుతానని క్లారిటీ ఇవ్వకుండా సమాధానం దాటవేసింది. మరోవైపు తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో "ఆమె నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ" అని చెప్పడం మరింత ఆసక్తి రేకెత్తించింది. అలాగే "త్వరలో గుడ్ న్యూస్ చెబుతాను" అని హింట్ ఇవ్వడంతో అప్పుడే అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

అయితే ఇప్పటివరకు ఇద్దరూ తమ రిలేషన్‌ షిప్‌ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం మంచి స్నేహితులుగా కలిసి వెళ్లి ఉండొచ్చనే కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలు బయట పెట్టడానికి సమయం తీసుకుంటారని అంటున్నారు. ఏదేమైనా ఉదయ్‌ పూర్ లో విరోష్ వెడ్డింగ్ మధ్య తరుణ్ భాస్కర్- ఈషా రెబ్బా జంటపై గాసిప్స్ మరింత పెరిగాయి. వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉందా? లేక ఇవన్నీ ఊహాగానాలేనా? అన్నది అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత క్లారిటీ రానుంది. అప్పటివరకు ఆ జంటపై చర్చలు మాత్రం టాలీవుడ్‌ లో కొనసాగుతూనే ఉండనున్నాయి.