Begin typing your search above and press return to search.

అనుపమకు తెలుగోళ్ల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: తరుణ్ భాస్కర్

అనుపమ కోసం మాట్లాడుతూ.. 'మీకు తమిళనాడు, కేరళలో ఎలాంటి ఆదరణ ఉందో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం మీకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది' అని తరుణ్ భాస్కర్ అన్నారు.

By:  M Prashanth   |   15 Oct 2026 9:29 AM IST
అనుపమకు తెలుగోళ్ల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: తరుణ్ భాస్కర్
X

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్న 'క్రేజీ కళ్యాణం' మూవీ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుండగా.. మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో నటుడు తరుణ్ భాస్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అనుపమకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుందని చెప్పారు.

సినిమా గురించి తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'అందరూ చాలా కష్టపడ్డారు. మూవీ విషయంలో నేను నిజంగానే ఎమోషనల్ అయ్యాను. మొదట్లో మూవీ ఆడుతుందా లేదా అనే డౌట్స్ ఉండేవి. దర్శకుడితో కొన్ని సమస్యలు వచ్చాయి. నిర్మాతకు కూడా నా అభ్యంతరాలు చెప్పాను. అయినప్పటికీ సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మంచి వైబ్స్ కనిపిస్తున్నాయి' అని అన్నారు.

'పెళ్లి చూపులు' మూవీ జర్నీని తరుణ్ గుర్తు చేసుకున్నారు. సినిమా విజయానికి కష్టంతో పాటు లక్ ఉండాలని చెప్పారు. కొన్ని విషయాలు మనం అనుకున్నట్లు జరుగుతాయని, మరికొన్ని జరగవని అన్నారు. 'పెళ్లి చూపులు' విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని తెలిపారు. విజయ్ దేవరకొండతో తన రిలేషన్ స్పెషల్ అని చెప్పారు. అక్టోబర్ 16న విజయ్ డాడీ బర్త్ డే అని, అదే రోజు 'రణబాలి', 'క్రేజీ కళ్యాణం' రిలీజ్ అవుతున్నాయన్నారు.

అనుపమ కోసం మాట్లాడుతూ.. 'మీకు తమిళనాడు, కేరళలో ఎలాంటి ఆదరణ ఉందో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం మీకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది' అని తరుణ్ భాస్కర్ అన్నారు. సినిమా విషయంలో తాను చాలా నమ్మకంగా ఉన్నానని, ప్రేక్షకులు కుటుంబంతో కలిసి థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరారు. చిత్రంలో నటించిన అఖిల్ రాజ్‌ను రైజింగ్ స్టార్‌ గా చెప్పుకొచ్చారు.

నిర్మాత బోసం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం 'విందు భోజనం' సినిమాతో అఖిల్ రాజ్‌ ను పరిచయం చేశానని తెలిపారు. కొవిడ్ కారణంగా ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేయలేకపోయామని, ఓటీటీలో విడుదల చేయాల్సి రావడం బాధ కలిగించిందని చెప్పారు. ఆ తర్వాత 'క్రేజీ కళ్యాణం' కథ విన్నప్పుడు అనుపమను హీరోయిన్‌ గా సెలెక్ట్ చేసినట్లు వివరించారు.

సినిమా విడుదల తేదీ మారినప్పటికీ తరుణ్ భాస్కర్, నరేష్, అనుపమ, అఖిల్ తనకు అండగా నిలిచారని చెప్పారు. ట్రైలర్ చూసిన నిర్మాత సురేష్ బాబు సినిమాను మెచ్చుకున్నారని తెలిపారు. దసరా సెలవుల్లో కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడంతో బాధపడ్డానని, ఇప్పుడు 'క్రేజీ కళ్యాణం'తో మంచి విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. సీనియర్ నటుడు నరేష్, అనుపమతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.

ఒక మధ్యతరగతి కుటుంబంలో పెళ్లి చేయడం అనేది తండ్రికి పెద్ద బాధ్యతతో కూడుకున్న పని అని అఖిల్ రాజ్ చెప్పారు. అలాంటి ఫ్యామిలీల ఎమోషన్స్, పెళ్లి సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ఈ సినిమాలో కనిపిస్తాయని తెలిపారు. దర్శకుడు భద్రప్ప గజుల స్టేజ్ పై ఎమోషనల్ అయ్యారు.. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను ఈ స్థాయికి తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పటికీ వారు పొలంలో పనిచేస్తూ తనను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తాను సాధించిన విజయాల కంటే, తన తల్లిదండ్రులు గర్వపడేలా చేయడమే ముఖ్యమని అన్నారు.