ఈ స్టార్ హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారా?
లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తరుణ్ ఆ తర్వాత తన పర్సనల్ విషయాల వల్ల కొన్ని కాంట్రవర్సీల్లో ఇరుక్కుని తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడు దాంతో అతనికి అవకాశాలు తగ్గిపోయాయి.
By: Gopi Velupala | 27 Sept 2026 1:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే ఇబ్బందులను తట్టుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిన వాళ్ళు మాత్రమే ఇక్కడ హీరోలుగా నిలబడతారు. ఆ తర్వాత స్టార్ హీరోలుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఏది ఏమైనా కూడా కొంతమంది స్టార్ హీరోలు కెరియర్ మొదట్లో వరుస సక్సెస్ లను సాధించి ఆ తర్వాత వాళ్ళు చేసిన సినిమాలకు పెద్దగా మార్కెట్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయిన పరిస్థితులైతే ఏర్పడ్డాయి. ముఖ్యంగా తరుణ్ లాంటి స్టార్ హీరో లవర్ బాయ్ గా చాలా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తరుణ్ ఆ తర్వాత తన పర్సనల్ విషయాల వల్ల కొన్ని కాంట్రవర్సీల్లో ఇరుక్కుని తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడు దాంతో అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. మొత్తానికైతే ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నప్పటికి అవేవి కార్యరూపమైతే దాల్చడం లేదు. మొత్తానికైతే తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తే మంచి ఇమేజ్ క్రియేట్ అవ్వడమే కాకుండా ప్రస్తుతం ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో తను కూడా ఒక మంచి పొజిషన్ కి వెళ్తాడు అంటూ మరి కొంతమంది కొంతమంది కొన్ని కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు...
'ప్రేమదేశం' సినిమాతో నటుడిగా మారిన అబ్బాస్ సైతం యూత్ ని చాలా అట్రాక్ట్ చేశాడు. తన హెయిర్ స్టైల్ ని ప్రతి ఒక్కరు చేయించుకున్నారు అంటే అప్పట్లో ఆయన ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఆయన సినిమా సెలక్షన్లో కొంతవరకు రాంగ్ డిసీజన్స్ తీసుకోవడం హిట్ అయ్యే సినిమాలను వదులుకోవడం వల్ల ఆయనకి అనుకున్న ఇమేజ్ అయితే రాలేదు. దాంతో ఆయనకి పెద్దగా అవకాశాలైతే రాలేదు. దాంతో ఆయన న్యూజిలాండ్ వెళ్లిపోయి అక్కడ సాఫ్టువేర్ ఇంజినీర్ గా స్థిరపడిపోయాడు. అతని చేత రీ ఎంట్రీ ఇప్పించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆయన రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు...
చిన్న సినిమాల్లో కాకుండా పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు హీరోలు ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వాళ్లకు మంచి ఆదరణ దక్కుతుంది. కాబట్టి వాళ్లు ఎలాంటి మూవీ తో వాళ్ల సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...
