అఫిషియల్... రష్మిక సినిమాలో పుష్ప స్టార్
పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటించిన స్టార్ నటుడు తారక్ పొన్నప్ప మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యాడు.
By: Ramesh Palla | 21 Oct 2025 2:00 PM ISTపుష్ప సినిమాలో కీలక పాత్రలో నటించిన స్టార్ నటుడు తారక్ పొన్నప్ప మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఈయన విలనిజంకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందుకే కన్నడ సినిమాలతో పాటు తెలుగులో వరుస ఆఫర్లను దక్కించుకుంటున్నాడు. కేజీఎఫ్ సినిమాతో నటుడిగా గుర్తింపు దక్కించుకున్న పొన్నప్ప నుంచి ముందు ముందు మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. దీపావళి సందర్భంగా తాను నటించబోతున్న కొత్త సినిమాను పొన్నప్ప అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పొన్నప్ప నటించబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి షూటింగ్ అప్‌డేట్ లేదు, కానీ తాను సినిమాలో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం ద్వారా పొన్నప్ప అందరి దృష్టిని ఆకర్షించాడు.
రష్మిక మందన్న హీరోయిన్‌గా మైసా...
రష్మిక మందన్న హీరోయిన్‌గా రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న మైసా సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. మైసా లో రష్మిక లుక్‌కి అంతా కూడా ఫిదా అయ్యారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయిందని, త్వరలోనే సినిమాను ముగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో చాలా స్పీడ్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేవలం తెలుగు, హిందీ అని కాకుండా అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. రష్మిక మందన్న నటిస్తున్న ఈ లేడీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయబోతున్నారు. అలాంటి పాన్ ఇండియా మూవీ లో రష్మిక మందనతో పాటు తారక్ పొన్నప్ప ముఖ్య పాత్రలో నటించడం ద్వారా కెరీర్ కి మంచి ఊపు దక్కినట్లు అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తారక్ పొన్నప్ప ముఖ్య పాత్రలో..
దేవర సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న తారక్ పొన్నప్ప సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన విలన్‌గానే కాకుండా లీడ్ రోల్స్ లోనూ నటించేందుకు ఆఫర్లు వచ్చాయట. కానీ ఈ నటుడు కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న కారణంగా ఆ సినిమాలను చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు రష్మిక మందన్న మైసా సినిమాలో నటించడం వల్ల తన స్టార్‌డంను ఈ నటుడు మరింతగా పెంచుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అన్‌ఫార్ములా ఫిల్మ్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరిన్ని సినిమా ఆఫర్లు ఈ సినిమా తర్వాత వస్తాయనే ధీమాను ఈ నటుడు సన్నిహితుల వద్ద చెబుతున్నాడని తెలుస్తోంది.
రష్మిక థామా సినిమా నేడే విడుదల
రష్మిక మందన్న నేడు థామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చి, భారీ వసూళ్లు నమోదు అవుతే వెంటనే మైసా సినిమా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రష్మిక మందన్న పాన్ ఇండియా రేంజ్‌లో మరింత స్టార్‌డం దక్కించుకునే విధంగా ఈ సినిమా ఫలితం ఉంటుంది అని ఆమె అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి నటనతో రష్మిక తన సినిమా సినిమాకు స్థాయిని పెంచుకుంటుంది. కనుక మైసా సినిమా ఆమెకు మరో మైల్‌స్టోన్ మూవీగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే నిజం అయితే నటుడు తారక్ పొన్నప్ప సైతం మంచి ఇమేజ్‌ను మైసాతో దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
