Begin typing your search above and press return to search.

బుగ్గ‌పై ముద్దు తెలివిగా ఎడిట్ చేసారు: తారా సుతారియా

తారా సుతారియా - వీర్ పహరియా ప్రేమాయ‌ణం గురించి కొన్ని నెల‌లుగా చాలా చ‌ర్చ సాగుతోంది.

By:  Sivaji Kontham   |   31 Dec 2025 12:59 AM IST
బుగ్గ‌పై ముద్దు తెలివిగా ఎడిట్ చేసారు: తారా సుతారియా
X

తారా సుతారియా - వీర్ పహరియా ప్రేమాయ‌ణం గురించి కొన్ని నెల‌లుగా చాలా చ‌ర్చ సాగుతోంది. ఈ జంట ప‌బ్లిక్ అప్పియ‌రెన్సులు, విదేశీ విహార‌యాత్ర‌ల‌కు సంబంధించిన ప్ర‌తి ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ గా మారుతోంది. అయితే త‌న ప్రేమికుడి ముందే, తారాను పాప్ గాయ‌కుడు ఏపి థిల్లాన్ ముద్దు పెట్టుకున్న వీడియో ఇంట‌ర్నెట్ లో సంచ‌ల‌నంగా మారింది. ఆ స‌మ‌యంలో ప్రియుడు వీర్ ప‌హారియా చాలా ఫీల‌య్యాడ‌ని అర్థం వ‌చ్చేలా ఒక వీడియోను రిలీజ్ చేయ‌డంతో అది ఇంట‌ర్నెట్ లో వేగంగా వైర‌ల్ అయింది.

వేదిక‌పై తారా సుతారియాతో డ్యాన్స్ చేసిన ఏపీ థిల్లాన్ స‌డెన్ గా తారా చిక్ పై ముద్దు పెట్టుకున్నాడు. వేదిక దిగువ‌న వీర్ పహారియా ఆ సీన్ చూస్తుండ‌గా ముఖంలో ఎక్స్ ప్రెష‌న్స్ పూర్తిగా మారిపోయాయి. ముంబై క‌చేరీలో ఈ స‌న్నివేశం ఊహించ‌నిది. ఇది ప్రేమ‌ప‌క్షుల‌ను విడదీసేలా ఉంది అంటూ నెటిజ‌నులు విశ్లేషించారు.

అయితే ఇప్పుడు ఆ ఊహాగానాల‌న్నిటికీ తారా సుతారియా తెర దించేసారు. తారా ఇన్‌స్టాలో కచేరీ నుండి ఒక వీడియోను షేర్ చేసింది. తప్పుదారి పట్టించే కథనాలు ప్ర‌చురించార‌ని తారా ఆ వీడియోని ఎడిట్ చేసిన వ్య‌క్తిపై సీరియ‌స్ అయ్యారు. ఏపీ థిల్లాన్ నా ఫేవ‌రెట్.. ఇది ఎంత మంచి రాత్రి! ముంబై... మా పాటపై ప్రేమను కురిపించినందుకు చాలా ధన్యవాదాలు. మ‌రింత చ‌క్క‌ని సంగీతం- జ్ఞాపకాలు కలిసి ఉన్నాయి. తప్పుడు కథనాలు న‌మ్మొద్దు. తెలివైన ఎడిటింగ్.. పిఆర్ ప్రచారాలు మమ్మల్ని కదిలించవు.. చివరికి, ప్రేమ నిజం ఎల్లప్పుడూ గెలుస్తాయి`` అని రాసారు. వీర్ పహారియా కూడా తన అభిప్రాయాన్ని చెబుతూ... అది నిజ‌మైన వీడియో కాదు. నా రియాక్షన్ ఫుటేజ్ మరొక పాట సమయంలో తీసిన‌ది. అది చెత్త ప్ర‌య‌త్నం.. జోకర్స్ అని సీరియ‌స్ అయ్యాడు.

దీనిని బ‌ట్టి ఉద్ధేశపూర్వ‌కంగా తారా సుతారియా -వీర్ పహారియా జంట‌ను ఎవ‌రైనా టార్గెట్ చేసారా? అన్న చ‌ర్చ మొద‌లైంది. నిజానికి అత‌డు ముద్దు పెట్టేయ‌డం అబ‌ద్ధం.. ఆ స‌మ‌యంలో అవి త‌న ఎక్స్ ప్రెష‌న్స్ కానే కావు! అని అంటున్నాడు వీర్ ప‌హారియా.

వీర్- తారా 2025లోనే డేటింగ్ ప్రారంభించారని ప్ర‌చారం ఉంది. ఈ జంట క‌లిసి ఎక్కువ స‌మ‌య గ‌డుపుతున్నారు. అప్పుడ‌ప్పుడు క‌లిసి విహార యాత్ర‌ల‌కు వెళుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ఇద్దరూ ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో షోస్టాపర్‌లుగా కలిసి కనిపించారు. ఇది ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. తరువాత గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా తమ రిలేష‌న్‌ని ధృవీకరించారు. డేటింగ్‌పై దాప‌రికం లేకుండా, బహిరంగంగానే అంగీక‌రించారు. త‌మ‌పై త‌ప్పుడు ప్రచారాన్ని ఖాత‌రు చేయ‌మ‌ని కూడా ఇప్పుడు ప్ర‌క‌టించారు.