ప్రియుడితో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన తారా సుతారియా.. క్యూట్ జంట ఫోటోలు వైరల్!
ఇకపోతే రొమాంటిక్ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న తార అందమైన క్యాప్షన్ కూడా జోడించింది.
By: Madhu Reddy | 13 Oct 2025 8:12 PM ISTఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు.. ఎప్పుడు ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పుకుంటారో తెలియదు. ఈ క్రమంలోనే తాజాగా మరొక జంట ప్రేమలో పడింది. ఈ విషయాన్ని అధికారికంగా ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ పోస్ట్ షేర్ చేసింది. మరి ఆ జంట ఎవరు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆ జంట ఎవరో కాదు.. తారా సుతారియా, వీర్ పహారియా.. తాజాగా ఈ జంట మనీష్ మల్హోత్ర నిర్వహించిన దీపావళి బాష్ లో పాల్గొన్నారు. అక్కడ ఈ అందమైన జంట కెమిస్ట్రీ పండగ వైభవాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అందమైన దుస్తులను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఫోటోల విషయానికి వస్తే.. మనీషా మల్హోత్రా అందంగా డిజైన్ చేసిన లెహంగాను తారా ధరించగా.. వీర్ క్లాసిక్ వైట్ కుర్తా సెట్ లో ఆమెకు పరిపూర్ణంగా పర్ఫెక్ట్ జోడి అనిపించారు. తారా, వీర్ ఒకరికొకరు రొమాంటిక్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిస్తూ మరింత అందంగా తమ బంధాన్ని రివీల్ చేశారు. మొత్తానికైతే ఈ జంట ఇప్పుడు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇకపోతే రొమాంటిక్ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న తార అందమైన క్యాప్షన్ కూడా జోడించింది." నిన్న రాత్రి దీపావళి బాష్ లో.. ప్రేమ , వెలుగులతో నిండిన ఈ రాత్రి నా డైనమైటితో మరింత అందంగా మారింది.. హ్యాపీ దీపావళి 2025 " అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . అంతేకాదు ఈ ఫోటోలను అటు వీర్ పహారియా కూడా తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఈ జంట ప్రేమ విషయానికి వస్తే.. ఇద్దరూ రెండు నెలల క్రితమే డేటింగ్ చేయడం ప్రారంభించారు. ఒకరికొకరు తెలుసుకొని.. తమ అభిప్రాయాలు పంచుకొని.. ఇప్పుడు ఎట్టకేలకు తమ ప్రేమను అందరితో పంచుకున్నారు.
ఇక తార సుతారియా విషయానికి వస్తే.. తారా గతంలో కరిష్మా , కరీనాకపూర్, రణధీర్ కపూర్ ల బంధువైన ఆధర్ జైన్ తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. 2025 ఫిబ్రవరిలో తారా స్నేహితురాలు అలేఖా అద్వానీని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తార అరుణోదయ్ సింగ్ తో రిలేషన్ కొనసాగించింది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమే అంటూ రూమర్స్ కి పెట్టారు. మొత్తానికైతే ఈ జంటకు సంబంధించిన ఈ ఫోటోలు ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
