రాజకీయ నాయకుడి కుమారుడితో నటి డేటింగ్?
బాలీవుడ్ లో యువనటీనటుల మధ్య డేటింగ్ వ్యవహారాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఏ డేటింగ్ ఎందాకా సాగుతుందో, ఎప్పుడు బ్రేకప్ అవుతుందో ఊహించలేం.
By: Sivaji Kontham | 3 Aug 2025 3:00 AM ISTబాలీవుడ్ లో యువనటీనటుల మధ్య డేటింగ్ వ్యవహారాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఏ డేటింగ్ ఎందాకా సాగుతుందో, ఎప్పుడు బ్రేకప్ అవుతుందో ఊహించలేం. అప్పటివరకూ విహారయాత్రలు, ఔటింగులు అంటూ జంట షికార్లతో పబ్లిక్ లో బోలెడంత హంగామా సృష్టిస్తారు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా కలరింగ్ ఇస్తారు. కానీ చివరికి వన్ ఫైన్ డే `విడిపోయాం` అంటూ శాడ్ న్యూస్ చెబుతారు.
మాజీ ముఖ్యమంత్రి మనవళ్లు పక్క దారి పట్టారు:
ఇది ఆ బాపతు అవునో కాదో తెలీదు కానీ, ఇప్పటికి యువహీరో వీర్ పహారియాతో యంగ్ హీరోయిన్ తారా సుతారియా డేటింగ్ వ్యవహారంపై జోరుగా మీడియా కథనాలొస్తున్నాయి. పబ్లిక్ లో ఈ జంట చెట్టా పట్టాల్ అంటూ షికార్ చేస్తుంటే, దానిపై మీడియా రకరకాల కథనాలు వండి వారుస్తోంది. మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో షికార్లు చేస్తోందంటూ తారా సుతారియాపై ఈ ఏడాది ఆరంభం నుంచి కథనాలొస్తున్నాయి. ఎప్పుడూ నెటిజనులను టీజ్ చేస్తూ, బోయ్ ఫ్రెండ్ తో ఫోటోలు వీడియోలను కూడా సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది తారా. వీర్ పహారియా జాన్వీ బోయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాకు సోదరుడు. శిఖర్ పహారియా- వీర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవళ్లు. రాజకీయ నేపథ్యం నుంచి గ్లామర్ రంగంలోకి వచ్చిన కుర్రాళ్లు. ఈ ఇద్దరూ హీరోలుగా ఎదిగేందుకు తమవంతు ప్రయత్నాల్లో ఉన్నారు.
తారాను కాపాడిన ప్రియుడు:
ఇలాంటి సమయంలో నటవారసురాళ్లతో డేటింగులు చేస్తూ, ఆ ఇద్దరూ నిరంతరం హెడ్ లైన్స్ లోకొస్తున్నారు. శిఖర్ ఇప్పటికే జాన్వీతో డేటింగులో ఉన్నాడు. ఇప్పుడు తారా సుతారియాతో వీర్ పహారియా డేటింగ్ వార్తలు హాట్ టాపిగ్గా మారుతున్నాయి. తాజాగా ముంబైలో ఓ రెస్టారెంట్ కి డిన్నర్ డేట్ కోసం వచ్చిన వీర్- తారా సుతారియా జంటపై కెమెరాలు ఫోకస్ చేసాయి. తారాను వెంబడిస్తున్న మీడియా నుంచి కాపాడుతూ, వీర్ రెస్టారెంట్ లో డిన్నర్ పూర్తి చేసి తిరిగి వెళుతున్నాడు. ఆ సమయంలో తనను వెంబడించేవారిని చూస్తూ, తారా సుతారియా చాలా అన్ ఈజీగా ఫీలైంది. ప్రియురాలికి అన్నీ తానే అయిన వీర్ పహారియా తారాను కార్ వైపు నడిపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ అందమై జంట ఫోటోలు, వీడియోలు వెబ్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి.
ఆ రోజు నుంచి అదే పనిగా...
అయితే తారా- వీర్ మధ్య ఏం జరుగుతోంది. అసలు ఇది ప్రేమాయణమేనా? లేక కేవలం స్నేహం మాత్రమేనా? అంటూ ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. గత జూలై నుంచి తారా- వీర్ మధ్య జోరు పెరిగిందని నెటిజనులు చెబుతున్నారు. జూలైలో తారా తన మ్యూజిక్ వీడియో `తోడి సి దారు`కి సంబంధించి పంజాబీ గాయకుడు ఏపీ ధిల్లాన్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసారు. దానికి వీర్ `నా` అనే వ్యాఖ్యను జోడించాడు. దాంతో పాటు ఒక స్టార్ ఈమోజీ, రెడ్ హార్ట్ ఎమోజీని జోడించాడు. దానికి తారా `మైన్` అని రిప్లప్ పంపింది. దుష్ట కన్ను - రెడ్ హార్ట్ ఎమోజిని కూడా జోడించింది. ఇది ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యానికి తొలి అడుగు! అంటూ ప్రచారం సాగింది.
ఆ ఇద్దరూ అలా మొదలయ్యారు:
తారా సుతారియా 2019లో `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2`(టైగర్, అనన్య ఇతర నటీనటులు) చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టగా, వీర్ పహారియా అక్షయ్ కుమార్‌తో కలిసి బాలీవుడ్ చిత్రం `స్కై ఫోర్స్`తో డెబ్యూ ఇచ్చాడు. కలిసి సినిమా చేయకపోయినా రంగుల ప్రపంచంలో ఈ జంట చాలా దగ్గరైపోవడం, చాలా కాలంగా సాన్నిహిత్యాన్ని కొనసాగించడం చర్చగా మారింది.
