Begin typing your search above and press return to search.

చీర‌లో తార సొగ‌సు చూడ‌త‌ర‌మా!

ఇక‌పోతే తారా ఇటీవ‌ల సినిమాల‌తో కంటే, ప్రియుడు వీర్ ప‌హారియాతో షికార్ల కార‌ణంగా నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.

By:  Sivaji Kontham   |   31 Aug 2025 4:00 AM IST
చీర‌లో తార సొగ‌సు చూడ‌త‌ర‌మా!
X

క‌ర‌ణ్ జోహార్ `స్టూడెంట్ ఆప్ ది ఇయ‌ర్ 2` చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది తారా సుతారియా. అనన్య పాండేతో పాటు తారా సుతారియా డెబ్యూ న‌టిగా ఆరంగేట్రం చేసింది. అయితే న‌ట‌వార‌సుల‌తో పోలిస్తే ఔట్ సైడ‌ర్స్ కి అంత‌గా అవ‌కాశాలు రావు అని తారా సుతారియా ఓ ఇంట‌ర్వ్యూలో ఆవేదన వ్య‌క్తం చేయ‌డం దుమారం రేపింది.


ఇక‌పోతే తారా ఇటీవ‌ల సినిమాల‌తో కంటే, ప్రియుడు వీర్ ప‌హారియాతో షికార్ల కార‌ణంగా నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. కొద్దిరోజులుగా ఈ జంట‌ డేటింగ్ లో ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల‌ రెగ్యుల‌ర్ గా ప‌లు కార్యక్రమాలలో కలిసి కనిపించారు. మొన్న‌టికి మొన్న‌ ముంబైలోని సెలబ్రిటీల అభిమాన రెస్టారెంట్ బాస్టియన్‌లో డిన్నర్ డేట్‌కు వెళ్లారు. ఇంత‌లోనే రెస్టారెంట్ నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీర్ - తారా జోడీ డీజే బీట్‌లకు డ్యాన్స్ చేస్తూ బోలెడంత సంద‌డి చేసారు.


పార్టీ నుంచి వీర్ పహరియా-తారా సుతారియా పార్టీ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. తాజాగా మ‌రోసారి ఈ జంట అత్యంత‌ చ‌నువుగా ఉన్న‌ ఫోటోలు వైర‌ల్‌గా షేర్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం వీర్ పహరియా తారా సుతారియాతో కలిసి ఒక‌ ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్ళింది, అక్కడ తారా షోస్టాపర్‌గా నిలిచింది. ఈ జంట తెల్లటి దుస్తులలో కలిసి చాలా అందంగా కనిపించారు. ఈ ఫోటోగ్రాఫ్స్ లో వీర్ `వైట్ అండ్ వైట్ కుర్తా`లో ఇస్మార్ట్ గా క‌నిపించ‌గా, కాంబినేష‌న్ వైట్ శారీలో తారా సుతారియా ఎంతో అందంగా క‌నిపించింది. ముఖ్యంగా తారా సుతారియా వీపందాన్ని ఎలివేట్ చేస్తూ ఫోటోషూట్ లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ జంట ఫోటోలు మ‌రోసారి ఇంటర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. చీర‌లో తార సొగ‌సు చూడ‌త‌ర‌మా? అంటూ అభిమానులు మంత్రముగ్ధుల‌వుతున్నారు.


తారా-వీర్ జంట నిజంగా అందంగా ఉంది.. అద్భుతమైన జంట‌! అంటూ అభిమానుల‌కు కితాబిచ్చేస్తున్నారు. అయితే వీర్ లేదా తారా ఇద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈ జంట ప్రేమాయ‌ణం కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మే. ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు త‌మ కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తారా ప్ర‌స్తుతం య‌ష్ చిత్రం టాక్సిక్ లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.