ఏది నిజం ఏది అబద్ధం! స్టార్ కపుల్ విడిపోయారా?
అందాల కథానాయిక తారా సుతారియా - వీర్ పహారియా జంట ఇటీవల మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.
By: Sivaji Kontham | 9 Jan 2026 9:29 AM ISTఅందాల కథానాయిక తారా సుతారియా - వీర్ పహారియా జంట ఇటీవల మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఓ లైవ్ కాన్సెర్ట్ లో తారా సుతారియాను గాయకుడు ఏపీ థిల్లాన్ ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అవ్వడం, ఆ సమయంలో అక్కడే షో వీక్షిస్తున్న వీర్ పహారియా దానికి చాలా నొచ్చుకున్నట్టు కనిపించిన విజువల్స్ ని వైరల్ చేయడంతో ఆ ఇద్దరి మధ్యా బంధం బ్రేక్ అయిందన్న ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత దీనిని వీర్ పహారియా, తారా ఇద్దరూ అధికారికంగా కొట్టి పారేసారు. ఇదంతా ఫేక్ ప్రచారం. తప్పుడు విజువల్స్ ని వైరల్ చేసారని వీర్ ఆక్షేపించాడు.
ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇటీవల బహిరంగంగా తమ రిలేషన్ షిప్ గురించి ప్రకటించకపోయినా కానీ, చాలా వేదికలపై కలిసి కనిపిస్తున్నారు. కానీ కాన్సెర్ట్ లో ఘటన తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే వారు నిశ్శబ్దంగా విడిపోయారని పలు బాలీవుడ్ సినీ వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. తారాను ముద్దుపెట్టుకున్న ఏపీ థిల్లాన్ వీడియోతో పాటు జోడించిన వీర్ గందరగోళ ఎక్స్ ప్రెషన్ వీడియో పూర్తిగా ఫేక్ అని ఆ తర్వాత వారు ఖండించారు. తమ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఇలాంటి ఫేక్ వీడియోలను రిలీజ్ చేసారని, తారా సుతారియా మండిపడ్డారు. వీర్ కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు.
నిజానికి గత ఏడాది ఆరంభంలో ఈ జంట డేటింగ్ ప్రారంభించారని కథనాలొచ్చాయి. జూలై 2025లో ఇన్‌స్టాలో ఒకరినొకరు `మైన్` అంటూ అధికారికం చేసారు. ఒకరిపై ఒకరు తమ ప్రేమను ప్రకటించారు. ఇప్పటివరకూ బ్రేకప్ వార్తలపై తారా సుతారియా కానీ, వీర్ పహారియా కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.
ఆ ఘటన తర్వాత ఈ జంట సైలెంట్ గా విడిపోయారు ఫిలంఫేర్ కథనం ప్రచురించింది.. కానీ అది నిజం కాదు అనడానికి తారా, వీర్ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తారా ఓ ప్రకటనలో వ్యాఖ్యానిస్తూ, తెలివైన ఎడిటింగ్ తప్పుడు కథనాలతో కొందరు పీఆర్‌లు చెల్లించే డబ్బు తీసుకుని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు.ఇవేవీ మమ్మల్ని కదిలించలేవు! అని బలంగా చెప్పారు తారా. చివరికి, ప్రేమ, సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తాయని ఎమోషనల్ నోట్ రాసారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, తారా 2019 సంవత్సరంలో అనన్య పాండేతో కలిసి `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. కరణ్‌జోహార్ దీనికి నిర్మాత. ఆ తర్వాత `ఏక్ విలన్ రిటర్న్స్`లో కూడా కనిపించింది. మర్జావాన్, తడప్, హీరోపంతి 2, అపూర్వ వంటి చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. తారా ఓ సందర్భంలో తనకు ఆశించిన అవకాశాలు రాలేదని ఆవేదన చెందింది. కానీ సౌత్ లో యష్ సరసన టాక్సిక్ లో నటించడం మరో మలుపు. మార్చిలో విడుదలవుతున్న ఈ సినిమా తనకు బిగ్ బ్రేక్ నిస్తుందని తారా ఆశిస్తోంది. ఇటీవలే విడుదలైన తారా ఫస్ట్ లుక్ పోస్టర్ కి, టీజర్ కి కూడా అద్భుత స్పందన వచ్చింది. తారా ప్రతిభపై టాక్సిక్ దర్శకురాలు గీతూ మోహన్ ప్రశంసలు కురిపించారు. అలాగే వీర్ పహారియా తన ఇతర ప్రాజెక్టులతో నటుడిగా బిజీగా ఉన్నాడు.
