బ్రేకప్ అయితే గర్ల్స్ హెయిర్ కట్ మారుస్తారు ఎందుకు?
బ్రేకప్ తర్వాత అమ్మాయిలు తమ రూపాన్ని.. ముఖ్యంగా హెయిర్ కట్‌ను మార్చుకోవడం అనేది ఒక మానసికమైన మార్పుకు సంకేతం.
By: Sivaji Kontham | 21 Feb 2026 9:00 PM ISTబ్రేకప్ తర్వాత అమ్మాయిలు తమ రూపాన్ని.. ముఖ్యంగా హెయిర్ కట్‌ను మార్చుకోవడం అనేది ఒక మానసికమైన మార్పుకు సంకేతం. దీనిని పాప్ కల్చర్‌లో `బ్రేక్-అప్ హెయిర్ కట్` అని పిలుస్తారు. పాత జ్ఞాపకాలను వదిలేసి.. కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభించడానికి ఇది ఒక మార్గమని మనస్తత్వవేత్తలు కూడా చెబుతుంటారు.
తారా సుతారియా విషయంలో కూడా ఇదే జరిగింది. నటుడు వీర్ పహారియా నుంచి విడిపోయిన తర్వాత, అంతకుముందు మాజీ ప్రియుడు ఆదార్ జైన్ (కపూర్ కుటుంబానికి చెందిన యువకుడు)తో బ్రేకప్ తర్వాత కూడా ఇదే విధంగా తన లుక్ ని మార్చింది. అయితే లుక్ మార్చడమే కాదు.. తారా మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా, కాన్ఫిడెంట్‌గా మారింది.
తారా సుతారియా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం రిలీజ్ కి రానున్న టాక్సిక్ పై చాలా హోప్స్ పెట్టుకుంది. రాకింగ్ స్టార్ యష్ (కేజీఎఫ్ ఫేమ్) కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం టాక్సిక్ లో తారా సుతారియా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ఇందులో తారా తన గ్లామర్ పక్కన పెట్టి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.
ఇటీవల ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేవలం టాక్సిక్ మాత్రమే కాకుండా.. ఇతర దక్షిణాది భాషా చిత్రాల్లో ముఖ్యంగా తెలుగులో నటించడానికి తారా చర్చలు జరుపుతోందని సమాచారం.
బ్రేకప్ తర్వాత ఫోటోషూట్లు:
తారా సుతారియా ఇటీవల తన ఇన్‌స్టాలో చాలా బో* అండ్ గ్లామరస్ ఫోటోషూట్లను షేర్ చేస్తున్నారు. బ్రేకప్ తర్వాత తారా, అనన్య పాండే, తమన్నా లాంటి భామలు తమ పాత ఇమేజ్‌ను చెరిపేసి.. కొత్త `సింగిల్` లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కొన్నిసార్లు వేషధారణల్లో పూర్తిగా కొత్తదనాన్ని ఈ భామలు ప్రయత్నించారు. ఎక్కువగా అమ్మాయిలు షార్ట్ హెయిర్ లేదా కొత్త హెయిర్ స్టైల్‌తో పాత రూపాన్ని మార్చుకోవడం చూస్తున్నాం. జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందనడానికి సంకేతమిదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చాలా మంది బ్రేకప్ తర్వాత అంతా అయిపోయిందనే భావనకు వస్తారు. అయితే తారా మాత్రం అందుకు భిన్నంగా ఎలాంటి కుంగుబాటు లేకుండా.. తన కెరీర్‌పై దృష్టి పెట్టి నటిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తన హెయిర్ కట్‌తో పాటు తన కెరీర్ గ్రాఫ్‌ను కూడా మార్చుకోవాలని తారా వేచి చూస్తున్నారు.
