వీడియో: వేదికపై ప్రియరాలికి ముద్దు.. షాక్‌లో ప్రియుడు!
ఈ మొత్తం ఎపిసోడ్ లో గాయకుడి పేరు ఏపి థిల్లాన్. అతడితో కలిసి వేదికపై డ్యాన్సులు చేసిన నటి తారా సుతారియా.
By: Sivaji Kontham | 27 Dec 2025 8:18 PM ISTఆమె అతడిని డీప్‌గా లవ్ చేస్తోంది. అతడు ఆమెను అంతే ఇదిగా ఆరాధిస్తున్నాడు. ఇద్దరూ కలిసి తమ రిలేషన్‌షిప్‌ని అధికారికం చేసారు. ప్రతిదీ ఓపెన్‌గానే.. బహిరంగంగానే..! కలిసి షికార్లు చేసినా, విదేశీ విహార యాత్రలకు వెళ్లినా, ప్రతిసారీ విమనాశ్రయంలో కెమెరా కళ్లకు అతడు చిక్కుతూనే ఉన్నారు.
ఇప్పుడు ఓ లైవ్ కాన్సెర్టుకు కూడా జంటగా కలిసొచ్చారు. కానీ ఈ కాన్సెర్ట్ లో ఊహించని ఒక పరిణామం ప్రియుడిని షాక్ కి గురి చేసింది. ప్రియురాలు నేరుగా వేదికపై గాయకుడితో కలిసి డ్యాన్స్ చేస్తోంది. అంతలోనే అతడు ఆమెను చనువుగా కౌగిలించుకుని బుగ్గపై ముద్దాడేసాడు. ఆ ఆకస్మిక పరిణామానికి ప్రియురాలు సడెన్ గా షాక్ కి గురైంది. అంతేకాదు.. ఆ సన్నివేశాన్ని వేదిక దిగువ నుంచి చూస్తున్న ప్రియుడు కూడా షాకింగ్ గా చూసాడు. అలా ఎలా జరుగుతుంది? అన్నట్టుగా అతడు ఆందోళనగా కనిపించాడు. వేదికపై ఇన్సిడెంట్ వైపే అతడు తీక్షణంగా చూస్తూ కనిపించాడు. అసలే యువగాయకుడు మాంచి జోష్ లో ఉన్నాడు. పక్కనే అందమైన అమ్మాయి స్టెప్పు కలిపేందుకు చెంతకు వచ్చింది. ఆ హుషారులో అతడు గానాలాపన చేస్తూనే చనువుగా ప్రవర్తించాడు. బుగ్గపై ముద్దాడేసాడు. అడపా దడపా ఈవెంట్లలో ఇలాంటివి చూస్తున్నా ఈ తీపి ముద్దు అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో గాయకుడి పేరు ఏపి థిల్లాన్. అతడితో కలిసి వేదికపై డ్యాన్సులు చేసిన నటి తారా సుతారియా. వేదిక దిగువన విస్మయంగా కిస్ సీన్ ని చూస్తూ ఉండిపోయిన తారా ప్రియుడు - వీర్ పహారియా. తారా సుతారియాను వేదికపైకి ఆహ్వానించిన ఏపీ థిల్లాన్ నిజానికి ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కనీసం తారా ప్రియుడు వీర్ కూడా ఊహించలేదు. అందుకే అతడు దానిని చాలా సర్ ప్రైజింగ్ గా అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో ఎలా స్పందించాలో కూడా అతడికి అర్థం కాలేదు. చెంపపై ఏపి థిల్లాన్ ముద్దు పెట్టగానే తారా కొంత సర్ ప్రైజ్ కి గురైనా కానీ అప్పటికి అస్సలు స్పందించలేదు. నిజానికి ఆ క్షణం అది ఒక లైటర్ వెయిన్ ఇన్సిడెంట్. దానిని అంత సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదు. కానీ నెటిజనులు మాత్రం ప్రతిదీ రంధ్రాన్వేషణ చేస్తారు. యువకుడైన ఏపీ థిల్లాన్, ఆమెకు ఆకర్షితుడయ్యాడు! అని నిరూపించదలిచారు. అందుకే ఈ క్లిప్ ని పదే పదే వైరల్ చేస్తూ వీర్ పహారియాను ఉడికిస్తున్నారు. వీర్ దీనికి ఇంతవరకూ స్పందించలేదు. కొన్ని గంటల్లోనే లక్షలాది లైక్ లతో ఈ వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాల్లో వైరల్ అయిపోయింది.
వీర్ ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అసౌకర్యంగా ఉన్నాడా? కలత చెందాడా? అంతగా పట్టించుకోలేదు కదా! అంటూ సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ నడుస్తోంది. ఘటనకు సంబంధించిన వీడియోను జూమ్ చేసి, జోకులు, చర్చలతో వేడెక్కిస్తున్నారు. ఇక తారా సుతారియా కెరీర్ మ్యాటర్ కి వస్తే, ఈ బ్యూటీకి ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. యష్ సరసన నటించిన `టాక్సిక్` ఒక్కటే పెద్ద హోప్. ఆ తర్వాత ఏ సినిమాలో నటిస్తుందో వివరాలేవీ లేవు. టాక్సిక్ విజయం సాధిస్తే, తారాకు సౌత్ లోను అవకాశాలు పెరిగే ఛాన్సుంటుంది. కానీ ఆ ఒక్క హిట్లు కొట్టడం ముఖ్యం. ప్రస్తుతానికి ఏపీ థిల్లాన్ ముద్దు తారాకు ఇంటర్నెట్ లో మైలేజ్ పెంచుతుంది.
