Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9.. కరెక్ట్ టైమ్ లో ఇమ్మాన్యుయేల్ కి తనూజ దెబ్బ..!

బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ ఇమ్మాన్యుయెల్ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్నారు. సీజన్ 9లో మొదటి నుంచి ఈ ఇద్దరే స్ట్రాంగ్ గా దూసుకెళ్తున్నారు.

By:  Ramesh Boddu   |   6 Dec 2025 3:47 PM IST
బిగ్ బాస్ 9.. కరెక్ట్ టైమ్ లో ఇమ్మాన్యుయేల్ కి తనూజ దెబ్బ..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ ఇమ్మాన్యుయెల్ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్నారు. సీజన్ 9లో మొదటి నుంచి ఈ ఇద్దరే స్ట్రాంగ్ గా దూసుకెళ్తున్నారు. తనూజ ఆల్రెడీ తన టాప్ ఓటింగ్ తో వెళ్తుండగా ఇమ్మాన్యుయెల్ అసలు నామినేషన్స్ లోకి రాకుండా కూడా తన సత్తా చాటుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ ఇద్దరు తమ ఆట ఆడుతూ ఒకరితో ఒకరు గొడవ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సీజన్ 9లో కరెక్ట్ టైం లో తనూజ ఇమ్మాన్యుయెల్ కి దెబ్బ కొట్టింది.

ఇమ్మాన్యుయెల్ బిల్డింగ్ ని టార్గెట్..

సీజన్ 9 లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, రీతు మధ్య ఒక టాస్క్ జరిగింది. కట్టు నిలబెట్టు టాస్క్ లో భాగంగా తనూజ రీతుకి సపోర్ట్ చేసింది. డీమాన్ పవన్, తనూజ రీతుకి హెల్ప్ చేశారు. భరణి, కళ్యాణ్ ఇమ్మాన్యుయెల్ కి సపోర్ట్ గా ఉన్నారు. ఐతే ఈ టాస్క్ లో తనూజ తనకు ఇచ్చిన బాల్స్ తో ఇమ్మాన్యుయెల్ బిల్డింగ్ ని బాగా టార్గెట్ చేసింది. దాని వల్ల ఇమ్మాన్యుయెల్ ఈ టాస్క్ ఓడిపోతాడు. అలా రీతు టికెట్ టు ఫినాలే టాస్క్ కి ఎంపిక అవుతుంది.

ఇమ్మాన్యుయెల్ కూడా తనూజ ఎక్కువ తన బ్రిక్స్ పడగొట్టడం వల్లే తను ఓడిపోయానని గుర్తించాడు. ఐతే ముందు టాస్క్ లో రీతు గెలుపుని తనూజ వ్యతిరేకించింది. కానీ నెక్స్ట్ టాస్క్ లో తనూజనే మళ్లీ రీతు గెలుపుకి సాయం చేసింది. ఐతే రీతు చౌదరి ఫైనల్ టాస్క్ లో ఓడిపోయింది. ఆమెతో టాస్క్ ఆడి గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు కళ్యాణ్ పడాల. కామనర్ గా బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి వచ్చిన కళ్యాణ్ సీజన్ 9 మొదటి ఫైనలిస్ట్ గా స్థానం సంపాదించాడు.

సీజన్ 9లో ఫైనలిస్ట్ కళ్యాణ్..

సీజన్ 9లో మరో రెండు వారాలు మాత్రమే ఉంది. ఇప్పటికే ఒక ఫైనలిస్ట్ కళ్యాణ్ దూసుకెళ్లగా మరో నలుగురు ఎవరన్నది ఆసక్తిగా ఉంది. ఐతే టాప్ 5లో తనూజ, ఇమ్మాన్యుయెల్ కన్ఫర్మ్ అని తెలుస్తుండగా సంజన, రీతు, భరణి, డీమాన్ పవన్ లో ఏ ఇద్దరికి ఆ ఛాన్స్ దక్కుతుందా అన్నది చూడాలి. ఈ వారం ఎవరు సుమన్ శెట్టి దాదాపు ఎలిమినేషన్ కన్ ఫర్మ్ అయ్యింది. ఐతే భరణి కూడా చివరి వారల్లో సూపర్ యాక్టివ్ అయ్యాడు. సో నెక్స్ట్ రెండు వారాల్లో ఏం జరుగుతుందో చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ కేటగిరిలో వచ్చిన కళ్యాణ్, డీమాన్ పవన్ ఇద్దరు కూడా టాప్ 5 ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తుంది. ఆల్రెడీ కళ్యాణ్ ఫైనలిస్ట్ కాగా డీమాన్ పవన్ కూడా ఆ అవకాశం దక్కించుకునే పాజిబులిటీ ఉందనిపిస్తుంది.