Begin typing your search above and press return to search.

తనూజతో ఆఖరిపోరాటంలో ఇమ్మాన్యుయెల్..!

బిగ్ బాస్ సీజన్ 9లో లీడర్ బోర్డ్ టాస్క్ లో తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయెల్ ఆట రసవత్తరంగా మారింది.

By:  Ramesh Boddu   |   13 Dec 2025 9:39 AM IST
తనూజతో ఆఖరిపోరాటంలో ఇమ్మాన్యుయెల్..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో లీడర్ బోర్డ్ టాస్క్ లో తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయెల్ ఆట రసవత్తరంగా మారింది. చివరగా హౌస్ మేట్స్ అందరిలో తనూజ, ఇమ్మాన్యుయెల్, సంజన మాత్రమే ఈ టాస్క్ లో ఉండగా హౌస్ మేట్స్ అంతా కూడా సంజనాని ఈ టాస్క్ నుంచి తీసేయాలని ఓట్ వేశారు. బెలూన్ ని బుట్టలో వేసే టాస్క్ లో తనూజ, ఇమ్మాన్యుయెల్ ఇద్దరు కూడా తమ బెస్ట్ ఇచ్చారు. ఐతే ఇమ్మాన్యుయెల్ 12 బెలూన్స్ ని వేయగా.. తనూజ ఒక బెలూన్ తక్కువ అంటే 11 బెలూన్స్ వేసింది. బజర్ మోగే సమయానికి ఇమ్మాన్యుయెల్ ఎక్కువ బెలూన్స్ వేశాడు కాబట్టి అతన్నే విన్నర్ గా డిసైడ్ చేస్తారు.

తనూజ ఓటింగ్ ద్వారానే ఇమ్యూనిటీ..

ఐతే సంజన, తనూజ, ఇమ్మాన్యుయెల్ మధ్య కీ తో పూల్ లో ఉన్న ఐటెంస్ తెచ్చి వారికి ఇచ్చిన ప్రాపర్టీస్ లో అమర్చాలి. ఈ టాస్క్ లో కూడా ఇమ్మాన్యుయెల్ గెలిచాడు. ఇక లీడర్ బోర్డ్ లో చివరి దాకా ఉన్న ఇమ్మాన్యుయెల్, తనూజ, సంజనాలకు బిగ్ బాస్ చివరి టాస్క్ ఇచ్చాడు. తమకు ఇచ్చిన బ్యాగ్ లను ఒక కడ్డీ సాయంతో నెట్టి ఒక బాస్కెట్ లో వేసి దాన్ని ఏర్పరచిన ఒక బుట్టలో వేయాలి. అలా ఎక్కువ ఎవరు వేస్తే వారి ఫ్లాగ్ బయటకు వస్తుంది. అలా ఈ సీజన్ ఫైనల్ వీక్ ఇమ్యూనిటీ పొందే ఛాన్స్ ఉంటుంది.

ఈ టాస్క్ లో అందరి కన్నా ముందు తనూజ ఎక్కువ బ్యాగ్ లను తన బుట్టలో వేసుకుంది. ఫైనల్ గా ఆమె ఈ వీక్ ఇమ్యూనిటీ పొందింది. ఐతే ఈ ఇమ్యూనిటీ పొందడానికి తనూజని బిగ్ బాస్ కన్ఫెషన్ రూం కి పిలిచి ఆమెకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇమ్యూనిటీ పొందాలంటే మీరు గెలుచుకున్న 3 లక్షలు ప్రైజ్ మనీ నుంచి తగ్గించబడతాయని అన్నారు. ఐతే తనూజ దానికి ఒప్పుకోకుండా ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే ఇమ్యూనిటీకి వెళ్తానని అన్నది. అలా ఫైనల్ గా తనూజ గెలిచినా సరే ఇమ్యూనిటీ తీసుకోకుండా ఆడియన్స్ మనసులు గెలుచుకుంది.

ఓడిపోయినందుకు ఇమ్మాన్యుయెల్ అప్సెట్..

చివరి టాస్క్ లో ఓడిపోయినందుకు ఇమ్మాన్యుయెల్ చాలా అప్సెట్ అయ్యాడు. బాగా ఎమోషనల్ అయ్యి కళ్యాణ్ ని హగ్ చేసుకుని ఏడ్చాడు. హౌస్ మేట్స్ అంతా కూడా ఇమ్మాన్యుయెల్ ని కన్ సోల్ చేశారు. అలా బిగ్ బాస్ సీజన్ 9 మరో వారం ఉందనగా హౌస్ మేట్స్ మధ్య టాస్కులు రసవత్తరంగా అనిపించాయి.

వారం మాత్రమే ఉంది కదా అని రిలాక్స్ అవ్వకుండా ఈసారి టాస్క్ లల్లో హౌస్ మేట్స్ చూపిస్తున్న కసి వాళ్లకి గెలుపు బాటలు వేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 అందరు అర్హులే అన్నట్టుగా ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. వారం తర్వాత టైటిల్ విన్నర్ ఒక్కరే అయినా సరే హౌస్ లో ఇప్పుడు ఉన్న వారంతా తమ బెస్ట్ ఎఫర్ట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.