Begin typing your search above and press return to search.

నాని కోసం విలన్ అవ్వక తప్పలేదా..?

ఆల్రెడీ మోహన్ బాబు విలనిజం తోనే వావ్ అనిపిస్తారని తెలుస్తుండగా.. ఇప్పుడు సినిమాలో తణికెళ్ల భరణి కూడా నెగిటివ్ రోల్ చేస్తారని తెలియడంతో ఆడియన్స్ మరింత ఆసక్తిగా ఉన్నారు.

By:  Ramesh Boddu   |   25 Jan 2026 11:16 AM IST
నాని కోసం విలన్ అవ్వక తప్పలేదా..?
X

న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దసరా తర్వాత ఈ కాంబినేషన్ పై ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయో తెలిసిందే. ది ప్యారడైజ్ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో వెరైటీ కథతో వస్తుంది. సినిమాలో నాని జడల్ అనే పాత్రలో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. సినిమాలో ప్రతి నాయకుడిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. సినిమాలో ఆయన రోల్ సర్ ప్రైజ్ చేస్తుందని టాక్. మోహన్ బాబు విలన్ నిజం ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

నాని ది ప్యారడైజ్ కోసం తణికెళ్ల భరణి..

ఐతే ఈ సినిమాలో మరో సర్ ప్రైజింగ్ విషయం ఏంటంటే నాని ది ప్యారడైజ్ సినిమా కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ తణికెళ్ల భరణి కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నారట. కెరీర్ స్తార్టింగ్ లో తణికెళ్ల భరణి విలన్ పాత్రల్లో అదరగొట్టారు. తోట రాముడుగా ఆయన చేసిన అభినయం ఇప్పటికీ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఐతే ఈమధ్య తణికెళ్ల భరణి కేవలం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు.

దాదాపు ఎన్నో ఏళ్లుగా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతున్నారు. ఐతే నాని ది ప్యారడైజ్ కోసం మళ్లీ తణికెళ్ల భరణి విలనిజం చూపించబోతున్నారట. సినిమాలో ఆయన సీన్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ఉంటాయని అంటున్నారు. నాని సినిమా అంటే ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఆల్రెడీ మోహన్ బాబు విలనిజం తోనే వావ్ అనిపిస్తారని తెలుస్తుండగా.. ఇప్పుడు సినిమాలో తణికెళ్ల భరణి కూడా నెగిటివ్ రోల్ చేస్తారని తెలియడంతో ఆడియన్స్ మరింత ఆసక్తిగా ఉన్నారు.

దసరాతో తన మాస్ పంథా..

నాని ది ప్యారడైజ్ సినిమాను మార్చి 26న రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అయ్యేలా ఉందని సినిమాను వాయిదా వేసే ప్లానింగ్ ఉందట. వరుస సినిమాలతో సక్సెస్ ఫాం కొనసాగిస్తున్న నాని ది ప్యారడైజ్ తో కూడా భారీ టార్గెట్ తోనే వస్తున్నారని తెలుస్తుంది. కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

దసరాతో తన మాస్ పంథా మొదలు పెట్టిన నాని ది ప్యారడైజ్ తో మరింత స్ట్రాంగ్ గా రాబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను చాలా సిన్సియర్ గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి కూడా సినిమా మీద ఉన్న నమ్మకంతో ప్రొడక్షన్ విషయంలో వెనక్కి తగ్గట్లేదని టాక్.

నాని సినిమాల సక్సెస్ రేషియో తెలుసు కాబట్టి బిజినెస్ విషయంలో డౌట్ పడాల్సిన పని లేదు. ది ప్యారడైజ్ సినిమాను నాని కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాను మేకర్స్ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.