కాంత అక్కడ ఓకే.. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి?
రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే ఎమోషనల్ డ్రామా రేపు తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని పెంచేసింది
By: M Prashanth | 13 Nov 2025 5:39 PM ISTరానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే ఎమోషనల్ డ్రామా రేపు తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమాకు సంబంధించి నిన్న చెన్నైలో మేకర్స్ స్పెషల్ ప్రీమియర్లు వేశారు. ఈ ప్రీమియర్లకు అదిరే రెస్పాన్స్ వస్తోంది. సినిమా అదిరిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రీమియర్ చూసిన ఆడియెన్స్ అందరూ ముక్త కంఠంతో చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని, పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్ అని కితాబిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. సినిమా కథ, విజువల్స్ అంటున్నారు. ఈ రెండింటిపై డైరెక్టర్ ఫోకస్ పెట్టిన తీరు మెప్పిస్తుందట. ఓవరాల్ గా తమిళ్ ప్రీమియర్ల నుంచి సినిమాకు వన్ సైడ్ పాజిటివ్ టాక్ వస్తుంది.
అలా తమిళ్ ప్రీమియర్లకు అంతటా మంచి టాక్ రావడంతో సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ఆశిస్తున్నారు. తొలి రోజే మంచి వసూళ్లు సాధించడం పక్కా అని అంచనాలు వేస్తున్నారు. ఇక ఇవాళ రాత్రి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాల్లోనూ ప్రీమియర్లు పడనున్నాయి. అయితే ఇవి రాష్ట్రమంతటా కాదు. ఎంపిత చేసిన కొన్ని నగరాల్లో, కొన్ని థియేటర్లలోనే ఈ స్పెషల్ ప్రీమియర్లు వేయనున్నారు.
తమిళ్ లో సూపర్ హిట్ రెస్పాన్స్ రావడంతో ఇక తెలుగు ప్రీమియర్ల టాక్ కోసం మేకర్స్ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే.. ప్రీమియర్స్ టాక్స్ ఓపెనింగ్ కు పెద్ద బూస్ట్ ఇచ్చినట్లు అవుతాయి. అందుకే ఇక్కడ కూడా అదే రేంజ్ లో టాక్ బయటకు వస్తే.. సినిమాకు ఎలాంటి ఢోకా ఉండదు. లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్లడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు అప్పుడే అంచనాలు వేసేస్తున్నాయి! అయితే ప్రీమియర్లకు పాజిటివ్ టాక్ రావడం ఒక రకంగా మంచిదే. కానీ, ఇదే ఫైనల్ రిజల్ట్ గా భావించలేం.
రేపు థియేటర్లలో బొమ్మ పడిన తర్వాత ఫస్ట్ షో కు బయటకు వచ్చిన టాకే అసలైన రివ్యూగా భావిస్తారు. అందుకే మేకర్స్ సినిమాపై ఎంత కాన్పిడెంట్ గా ఉన్నా.. థియేటర్లలో రిలీజైన రోజే వాళ్లపై బరువు దిగుతుంది. మరి ఇంకొన్ని గంటల్లోనే ఈ పీరియాడిక్ డ్రామా రిలీజ్ కానుంది. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇక ఈ సినిమాను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్, వెటరన్ యాక్టర్ త్యాగరాజ భాగవతార్ కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇది 1950ల్లో సాగే కథ కావడంతో షూటింగ్ సమయంలో పాత కెమెరాలను కూడా వాడారు. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. భాగ్య శ్రీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దుల్కర్ కీలక పాత్ర పోషించారు. అలాగే రానా గెస్ట్ అప్పియరెన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. రానా, దుల్కర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
