Begin typing your search above and press return to search.

తమిళ క్రియేటర్స్ టాలీవుడ్ ఎట్రాక్షన్స్..?

ఐతే పాన్ ఇండియా లెవెల్ లో కోలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం తమ సత్తా చాటుతున్నారు.

By:  Ramesh Boddu   |   22 Jan 2026 6:00 PM IST
తమిళ క్రియేటర్స్ టాలీవుడ్ ఎట్రాక్షన్స్..?
X

బాలీవుడ్ ని కూడా బీట్ చేస్తూ టాలీవుడ్ సినిమాలు తెలుగు స్టార్స్ చేస్తున్న హంగామా తెలిసిందే. బాహుబలి ప్రభాస్ తో మొదలైన ఈ డామినేషన్ అల్లు అర్జున్, ఎన్ టీ ఆర్, రాం చరణ్ ఇలా అందరు తమ సత్తా చాటుతున్నారు. ఐతే పాన్ ఇండియా లెవెల్ లో కోలీవుడ్ స్టార్స్ స్టామినా ప్రూవ్ చేయాలని చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సక్సెస్ అవ్వట్లేదు. ఐతే పాన్ ఇండియా లెవెల్ లో కోలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం తమ సత్తా చాటుతున్నారు. అట్లీ, లోకేష్ కనకరాజ్, నెల్సన్ ఇలాంటి వారు నేషనల్ లెవెల్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు.

తమిళ దర్శకుల్లో కమర్షియల్ సక్సెస్..

అట్లీ నెక్స్ట్ అల్లు అర్జున్ తో క్రేజీ సినిమా చేస్తుండగా.. నెల్సన్ జైలర్ 2 తర్వాత తారక్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్ తోనే లోకేష్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయ్యింది. ఐతే తమిళ దర్శకుల్లో కమర్షియల్ సక్సెస్ లో ఉన్న వీరు మాత్రమే కాదు తమ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మరికొంతమంది డైరెక్టర్స్ కూడా తెలుగు లో సినిమాలు చేయాలని చూస్తున్నారు.

కోలీవుడ్ లో వెట్రిమారన్ కి ఉన్న బ్రాండ్ ఏంటో తెలిసిందే. ఆయన ఎప్పటి నుంచో తెలుగులో సినిమా చేయాలని చూస్తున్నారు. త్వరలోనే అది జరిగే ఛాన్స్ ఉన్నట్టు టాక్. అమరన్ తో సక్సెస్ అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి కూడా తెలుగు ఆడియన్స్ చూపించిన ప్రేమకు స్ట్రైట్ తెలుగు సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. హీరో ఎవరన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ ధనుష్ తో ప్రస్తుతం రాజ్ కుమార్ చేస్తున్న సినిమా తర్వాత తెలుగు సినిమానే ఉంటుందని టాక్.

తమిళ్ లో సత్తా చాటుతున్న..

ఇక జై భీమ్ తో అలరించిన టీజే జ్ఞానవేల్ కూడా తెలుగులో నానితో సినిమాకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని తెలుస్తుంది. జై భీం తమిళంతో పాటు తెలుగులో కూడా సక్సెస్ అందుకుంది. అందుకే జ్ఞానవేల్ తెలుగు ఎంట్రీ కోసం రెడీ అన్నట్టు తెలుస్తుంది.

సో తమిళ్ లో సత్తా చాటుతున్న స్టార్ డైరెక్టర్స్ తో పాటుగా తమ కంటెంట్ తో అలరిస్తున్న దర్శకులు కూడా తెలుగులో సినిమాలు చేయాలనే ఆసక్తితో ఉన్నారు. తెలుగు ఆడియన్స్ కమర్షియల్ సినిమాలను ఎంత బాగా ఆదరిస్తారో కంటెంట్ ఉన్న సినిమాలను అంతకన్నా గొప్పగా ఆదరిస్తారు. అందుకే తెలుగులో సినిమాలు చేసి ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు.

తమిళ సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్స్ కొంతమంది డైరెక్ట్ తెలుగు సినిమా చేసి ఇక్కడి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో మన డైరెక్టర్స్ మాత్రమే కాదు తమిళ, కన్నడ, మళయాళ డైరెక్టర్స్ వచ్చి సినిమాలు చేసినా కూడా అదే రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారు.