Begin typing your search above and press return to search.

తమిళ దర్శకులు ఆ ఒక్క విషయంలో క్లారిటి తెచ్చుకోవాల్సిందేనా...

గతంలో చాలామంది తమిళ దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు.

By:  Gopi Velupala   |   25 Sept 2026 9:37 AM IST
తమిళ దర్శకులు ఆ ఒక్క విషయంలో క్లారిటి తెచ్చుకోవాల్సిందేనా...
X

గతంలో చాలామంది తమిళ దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా మణిరత్నం, శంకర్ లాంటి దర్శకులు వరుస సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టారు. తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా వాళ్ల సినిమాలను రిలీజ్ చేసి ఇక్కడ కూడా వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు వాళ్లతో పాటు చాలామంది దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ మూవీ వచ్చినా కూడా అది ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టడం లేదు. కారణం ఏదైనా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు... దర్శకులు సైతం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూనే వాళ్ల మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇతర భాషల దర్శకులతో పోలిస్తే తమిళ్ డైరెక్టర్లు కొంతవరకు వెనుకబడి పోతున్నారు. అట్లీ, లోకేష్ కనకరాజులను మినహాయిస్తే మిగిలిన దర్శకులు ఎవరు కూడా వాళ్ల సత్తా చూపించలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళను వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరమైతే ఉంది.

తద్వారా ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్ తో 'రాకా' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇంతకుముందు ఆయన షారుక్ ఖాన్ తో 'జవాన్' సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. తమిళ హీరోలతో మాత్రం ఆయన చేసిన సినిమాలు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టలేకపోయాయి. అందుకే ఆయన ఇతర భాషల హీరోల మీద డిపెండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తమిళ దర్శకులు సైతం ఇంతకుముందు చేసినట్టుగా హీరోలను డీ గ్లామర్ రోల్ లో చూపిస్తూ మూవీస్ చేయడం కంటే పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యే కంటెంట్ ని తీసుకొని ప్రేక్షకులను మెప్పిస్తే బాగుంటుందనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో వీళ్ళందరు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పటికి అవి ఆశించిన మేరకు విజయాలను సాధించడం లేదు... ఇక ఎంతైనా కూడా ఇతర భాషల దర్శకులకు పోటీని ఇవ్వాలంటే మాత్రం వాళ్ళు చాలా వరకు మారాలి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు... మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న చాలామంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు...