Begin typing your search above and press return to search.

సినిమాల నుంచీ రిటైర్మెంట్ తీసుకోబోతున్న త్రిష?

నిజానికి త్రిష లాంటి సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారన్న వార్త ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు.

By:  Garuda Media   |   7 April 2026 11:02 AM IST
సినిమాల నుంచీ రిటైర్మెంట్ తీసుకోబోతున్న త్రిష?
X

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన స్టార్ హీరోయిన్ త్రిష, త్వరలో సినిమాలకు స్వస్తి పలకనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. గత కొన్ని రోజులుగా ఆమె రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తుండగా, తాజాగా ప్రముఖ నటుడు మరియు దర్శకుడు చిత్ర లక్ష్మణన్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. త్రిష నిర్ణయం వెనుక అసలు కారణమేంటో అని అభిమానులు ఇప్పుడు తెగ ఆరా తీస్తున్నారు.

చిత్ర లక్ష్మణన్ షాకింగ్ కామెంట్స్: వైరల్ అవుతున్న వీడియో:

యూట్యూబ్ వేదికగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చిత్ర లక్ష్మణన్ సంచలన విషయాలు బయటపెట్టారు. త్రిష ఇకపై సినిమాల్లో కొనసాగాలని అనుకోవడం లేదని, తనకు వస్తున్న కొత్త అవకాశాలను కూడా ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై కొందరు నిర్మాతలని సంప్రదించగా వారు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించినట్లు ఆయన తెలిపారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఏదైనా విషయంపై పూర్తి క్లారిటీ ఉంటేనే చిత్ర లక్ష్మణన్ మాట్లాడతారని పేరు ఉండటంతో, ఈ వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

చేతిలో భారీ చిత్రాలు.. ఆ తర్వాతే అసలు మలుపు:

ప్రస్తుతం త్రిష చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. సూర్య హీరోగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కరుప్పు’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, మే 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక దీనితో పాటు మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కూడా షూటింగ్ ముగించుకుంది. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ రెండు పెద్ద సినిమాలు విడుదలైన తర్వాతే ఆమె తన కెరీర్ విషయంలో ఏదైనా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

త్రిష స్పందన కోసం ఎదురుచూపులు:

నిజానికి త్రిష లాంటి సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారన్న వార్త ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న త్రిష, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు త్రిష టీమ్ నుంచి కానీ, ఆమె నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే త్రిష స్వయంగా క్లారిటీ ఇవ్వాలని కోరుకున్నారు.

స్పందించిన త్రిష:

అయితే ఈ రూమర్స్ పై త్రిష స్పందించింది. ముఖ్యంగా తాను సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాను అంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ.." నేను సినిమాలకు దూరం కాబోతున్నానట.. ఇక ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేయడం తగదు.. ఇంకా ఏమైనా ఉంటే ఆ రూమర్లన్నింటినీ ఈరోజుతో ఆపేయండి " అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది త్రిష.