Begin typing your search above and press return to search.

కూరగాయలు అమ్మి సింప్లిసిటీ చాటుకున్న నటుడు!

కోలీవుడ్ నటుడు విమల్ తెరపై ఎంత సరదాగా కనిపిస్తారో? నిజ జీవితంలోనూ అంతే సాధారణంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు.

By:  Srikanth Kontham   |   20 Aug 2026 12:19 PM IST
కూరగాయలు అమ్మి సింప్లిసిటీ చాటుకున్న నటుడు!
X

కోలీవుడ్ నటుడు విమల్ తెరపై ఎంత సరదాగా కనిపిస్తారో? నిజ జీవితంలోనూ అంతే సాధారణంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. `కలవాణి` లాంటి చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసిన విల‌మ్ ప్రస్తుతం సినిమాల పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన చేసిన ఓ సాహసోపేతమైన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి లోని స్వగ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు విమల్ రోడ్డు పక్కన మార్కెట్‌లో స్వయంగా కూరగాయలు అమ్ముతూ కనిపించారు.

స్థానిక మార్కెట్‌కు వెళ్లి సాధారణ వ్యాపారిలా కూరగాయల బండి వద్ద నిలబడి, గిరాకీలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి ఆయన చూపించిన సింప్లిసిటీ స్థానిక ప్రజల మనసులను గెలుచుకుంది. అయితే విమల్ ఇలా మార్కెట్‌లో కూరగాయలు అమ్మడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం .. సరదా సన్నివేశం ఉంది. అయిదే ఇది మీడియాలో వేరే కోణంలో చర్చకు దారి తీసింది. కొద్దికాలంగా ఆయనపై కొన్ని ఆర్థిక వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు చుట్టుముట్టాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతున్న తరుణంలో ఆయన ఇలా సామాన్యుడిగా కనిపించడం చర్చనీయాంశమైంది.

ఒకవైపు ఆర్థికపరమైన చిక్కులు, మరోవైపు కెరీర్‌లో ఎదురుదెబ్బలు తగులుతున్నా? విమల్ ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోలేదని ఆయన అభిమానులు అంటున్నారు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, తన మూలాలను మరువకుండా భూమి విమ‌ల్ భూమి మీదే కాళు మోపి జీవిస్తున్న తీరు పలువురి ప్రశంసలను అందుకుంటోంది. స్టార్ హీరో అనే అహంభావం లేకుండా ప్రజల్లో కలిసిపోయే ఆయన నైజం నిజంగా అభినందనీయం.

సినిమా రంగంలో ఒడుదొడుకులు రావడం సహజమే. గెలుపు ఓటములు ఎవరికైనా శాశ్వతం కాదని విమల్ ఈ సంఘటన ద్వారా నిరూపించారు. చట్టపరమైన వివాదాలు ఎదురవుతున్నా? వాటిని ఎదుర్కొంటూనే తన దైన శైలిలో జీవితాన్ని ఆస్వాదిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. తోటి నటులు , అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

మొత్తానికి విమ‌ల్ చెక్ బౌన్స్ వివాదాల నీడలో ఉన్నప్పటికీ త‌న సాధారణ ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా సొంతూరి మట్టి మనుషులతో ఆయన గడిపిన క్షణాలు సెలబ్రిటీల జీవితంలోనూ సామాన్యత ఉంటుందని చెప్పకనే చెప్పాయి. భవిష్యత్తులో విమ‌ల్ లీగల్ చిక్కుల నుండి బయటపడి మళ్లీ సినిమాలతో బిజీ కావాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.