Begin typing your search above and press return to search.

రూటు మార్చిన మిల్కీ బ్యూటీ

త‌మ‌న్నా భాటియా. ముందు చిన్న హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ చాలా త‌క్కువ టైమ్ లోనే స్టార్ హీరోలందరి స‌ర‌స‌న జ‌త క‌ట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 Dec 2025 4:00 PM IST
రూటు మార్చిన మిల్కీ బ్యూటీ
X

త‌మ‌న్నా భాటియా. ముందు చిన్న హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ చాలా త‌క్కువ టైమ్ లోనే స్టార్ హీరోలందరి స‌ర‌స‌న జ‌త క‌ట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే గ‌త కొన్నాళ్లుగా త‌మ‌న్నా బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఎక్కువ‌గా ఐటెం సాంగ్స్ చేస్తూ అల‌రిస్తున్నారు త‌మ‌న్నా.

బాలీవుడ్ బ‌యోపిక్ లో త‌మ‌న్నా

గ‌త కొన్నాళ్లుగా త‌మ‌న్నాను ఎక్కువ‌గా ఐటెం సాంగ్స్ లోనే ఆడియ‌న్స్ చూస్తూ వ‌చ్చారు. అలాంటి త‌మ‌న్నా ఇప్పుడు త‌న రూట్ ను మార్చి ఓ బాలీవుడ్ బ‌యోపిక్ లో కీల‌క పాత్ర చేస్తున్నారు. లెజండ‌రీ డైరెక్ట‌ర్ వి. శాంతారామ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతుండ‌గా అందులో శాంతారామ్ రెండో భార్య‌, ఒక‌ప్ప‌టి న‌టి అయిన జ‌య‌శ్రీ గ‌డ్క‌ర్ పాత్ర‌లో త‌మ‌న్నా క‌నిపించ‌నున్నారు.

వింటేజ్ వైబ్ ను తీసుకొచ్చిన మిల్కీ బ్యూటీ

రీసెంట్ గా మేక‌ర్స్ ఆ సినిమా నుంచి త‌మ‌న్నా ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయ‌గా, అందులో త‌మ‌న్నా వింటేజ్ సెట‌ప్ లో చీర క‌ట్టులో ఎంతో అందంగా మెరిశారు. ఇంకా చెప్పాలంటే త‌మ‌న్నా ఆ పోస్ట‌ర్ లో ఒక వింటేజ్ న‌టి యొక్క వైబ్ ను తీసుకొచ్చారు. కెరీర్లో ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ‌గా గ్లామ‌ర‌స్ రోల్స్ చేసిన త‌మ‌న్నా రీసెంట్ గా ఎక్కువ‌గా ఐటెం సాంగ్స్ చేస్తూ వ‌చ్చి, ఇప్పుడు స‌డెన్ గా ఓ బ‌యోపిక్ లో కీల‌క పాత్ర కు ఎంపిక‌వ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

మ‌రి రెగ్యుల‌ర్ గా త‌మ‌న్నాను గ్లామ‌ర‌స్ లుక్స్ లో చూడ‌టం అల‌వాటు చేసుకున్న ఆడియ‌న్స్ ను త‌మ‌న్నా ఈ సినిమాతో ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి. అయితే న‌టిగా త‌మ‌న్నా ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడూ ఫెయిలైంది లేదు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన పాత్ర‌కు 100% న్యాయం చేసే త‌మ‌న్నా మ‌రి ఈ బ‌యోపిక్ తో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటారో చూడాలి. అభిజీత్ శిరీష్ దేశ్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సిద్ధాంత్ చ‌తుర్వేది ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు.