Begin typing your search above and press return to search.

20 ఏళ్లలో ఇంతటి అందగాడిని చూడలేదట..!

అంతే కాకుండా తన 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో సిద్దార్థ్‌ మల్హోత్ర వంటి దయా హృదయుడిని చూడలేదని, అంతే కాకుండా ఇంతటి అందగాడిని కూడా చూడలేదు అంది.

By:  Ramesh Palla   |   17 Sept 2026 4:02 PM IST
20 ఏళ్లలో ఇంతటి అందగాడిని చూడలేదట..!
X

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ఖతం అని అనుకున్న ప్రతిసారి లక్కీగా ఆఫర్లు దక్కించుకుంటూ వస్తుంది. గత పదేళ్లుగా టాలీవుడ్‌లో అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా 'ది వాన్‌' అనే హిందీ సినిమాలో నటించింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించడం ద్వారా మరోసారి బాలీవుడ్‌ మీడియాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తమన్నా బాలీవుడ్‌లో సైతం ఇక మీదట ఆఫర్లు అందుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం జరిగింది.

సిద్దార్థ్‌ మల్హోత్ర హీరోగా 'ది వాన్‌' మూవీ...

సూపర్‌ నేచురల్‌ పవర్‌ నేపథ్యంలో ఫాంటసీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. దేవుడిపై నమ్మకం లేని హీరో, ఒక గ్రామంలో ఉన్న అతీంద్ర శక్తులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథాంశం గా చెబుతున్నారు. సినిమాలో సిద్దార్థ్‌ మల్హోత్రాకి తమన్నా భార్య పాత్రలో నటించింది. వీరిద్దరి కాంబో సీన్స్ ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని, ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌ యూత్‌ను ఆకట్టుకుంటాయని అంటున్నారు. సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పై ప్రశంసలు కురిపించింది. ఏ హీరోయిన్‌ అయినా తన సినిమా హీరో పై ప్రశంసలు కురిపించడం అనేది కామన్‌ విషయం. కానీ తమన్నా 'ది వాన్‌' సినిమా ట్రైలర్‌ లాంచ్‌లో అంతకు మించి అన్నట్లుగా మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతే కాకుండా విమర్శలు కూడా తెచ్చి పెట్టింది.

తమన్నా హీరోయిన్‌గా నటించిన మూవీ...

తమన్నా 'ది వాన్‌' మూవీ ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ... సిద్దార్థ్‌ మల్హోత్ర మంచి కో స్టార్‌ అంది. అంతే కాకుండా తన 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో సిద్దార్థ్‌ మల్హోత్ర వంటి దయా హృదయుడిని చూడలేదని, అంతే కాకుండా ఇంతటి అందగాడిని కూడా చూడలేదు అంది. హ్యాండ్సమ్‌ అనే పదంకు సిద్దార్థ మల్హోత్ర సరిగ్గా సెట్‌ అవుతాడు అంది. సినిమాలో అతడితో కలిసి ప్రయాణించడం సంతోషాన్ని ఇచ్చిందని తమన్నా చెప్పుకొచ్చింది. ఒక మంచి కోస్టార్‌, ఒక మంచి వ్యక్తి అని సిద్దార్థ్‌ గురించి తమన్నా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఒక హీరో గురించి ఈ స్థాయిలో ఒక హీరోయిన్‌ మాట్లాడటం చాలా అరుదుగా చూస్తూ ఉంటామని, మనసుకు నచ్చిన వారి గురించి మాత్రమే ఇలా మాట్లాడుతారని, మనసులో ఉన్న వారి గురించి మాత్రమే ఇలా మాట్లాడగలరు అని పలువురు సోషల్‌ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

సిద్దార్థ్‌ మల్హోత్ర పై తమన్నా కామెంట్స్‌...

సోషల్‌ మీడియాలో తమన్నా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సిద్దార్థ్‌ మల్హోత్ర గురించి మాట్లాడిన మాటల వరకు వీడియో బైట్‌ను కట్‌ చేసి చాలా మంది షేర్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ వీడియోను సిద్దార్థ్‌ మల్హోత్ర యొక్క భార్య కియారా అద్వానీ తప్పకుండా చూడాలని కొందరు అంటున్నారు. సిద్దార్థ్‌ గురించి తమన్నా చేసిన వ్యాఖ్యలకు కియారా అద్వానీ మురిసి పోతూ ఉంటుందని కొందరు కామెంట్‌ చేస్తే, మరికొందరు మాత్రం కియారా అద్వానీ కి కోపం కట్టలు తెచ్చుకునే అవకాశం ఉందని, ఇంటికి వెళ్లిన తర్వాత సిద్దార్థ్‌ మల్హోత్రాకి కచ్చితంగా క్లాస్ పీకి ఉంటుందని కొందరు ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి సిద్దార్థ్‌ మల్హోత్ర పై తమన్నా చేసిన వ్యాఖ్యల కారణంగా 'ది వాన్‌' మూవీకి మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. సినిమా గురించి ఇప్పటి వరకు చాలా మందికి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు సినిమాకు జాతీయ మీడియాలో ఫ్రీ గా కవరేజ్ దక్కింది.