2026 లో తమన్నా బాలీవుడ్ కే పరిమితమా?
మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ కి వెళ్లినా? సౌత్ సినిమాలో మధ్యలో కనిపించడం మాత్రం ఆపలేదు.
By: Srikanth Kontham | 17 March 2026 9:00 PM ISTమిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ కి వెళ్లినా? సౌత్ సినిమాలో మధ్యలో కనిపించడం మాత్రం ఆపలేదు. వచ్చిన అవకాశాలను తెలివిగా సద్వినియోగం చేసుకుంది. తాజాగా అమ్మడి లైనప్ చూస్తే? కెరీర్ ఆసక్తికరమైన మలుపు తిరుగుతోందా? అన్న సందేహం మొదలైంది. దశాబ్ద కాలానికి పైగా సౌత్ ఇండియాలో ముఖ్యంగా టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలిగిన భామ 2026లో మాత్రం పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితం కాబోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ దాదాపు హిందీ చిత్రాలే . దక్షిణాదిలో కొత్త సినిమాలేవీ కమిట్ అయినట్లు కనిపించలేదు. దీంతో అమ్మడు మకాం పూర్తిగా ముంబైకి మార్చేసిందా అన్న చర్చ మొదలైంది.
ప్రస్తుతం తమన్నా బాలీవుడ్‌లో వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. షాహిద్ కపూర్‌తో కలిసి నటిస్తోన్న ఓరోమియో ఆన్ సెట్స్ లో ఉంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి `వాన్ లోనూ నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా అజయ్ దేవగన్, సంజయ్ దత్ వంటి స్టార్ హీరోల సరసన రెంజర్ వంటి భారీ చిత్రాల్లోనూ ఛాన్స్ అందుకుంది. ఇవిగాక మరో రెండు మూడు చిత్రాలకు కమిట్ అవుతుందనే వార్తలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. అంటే 2026 క్యాలెండర్ మొత్తం తమన్నా బాలీవుడ్ సినిమాలతో నిండినట్లే.
ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఏడాదికి నాలుగైదు సినిమాలైనా అమ్మడు రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు అదే సౌత్ సినిమాలకు గ్యాప్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ రకరకాల కారణాలను విశ్లేషించొచ్చు. అవకాశాలు రాకపోవడం వల్ల కాకపోవచ్చు లేదా? వచ్చినా హిందీ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల అయినా డేట్లు కేటాయించలేకపోవచ్చు. తెలుగులో అమ్మడు చివరగా చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. బాలీవుడ్ మేకర్స్ ఆమెలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ విభిన్నమైన పాత్రలు ఆఫర్ చేస్తుండటంతో హిందీ ప్రాజెక్టులకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పైన కూడా తమన్నా బాలీవుడ్ వెబ్ సిరీస్‌లతోనే బిజీగా ఉంది. గతంలో ఆమె నటించిన హిందీ సిరీస్‌లకు మంచి గుర్తింపు రావడంతో అక్కడ ఆమెకు భారీ రెమ్యునరేషన్ తో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణాది నుంచి వస్తున్న సాధారణ కమర్షియల్ సినిమాల కంటే, బాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న చిత్రాలకే ఆమె ఓటు వేస్తోందని చెప్పొచ్చు. ఇప్పటి వరకూ కమిట్ అయిన హిందీ చిత్రాలు చూస్తే? 2026 సంవత్సరం తమన్నా కెరీర్‌లో హిందీ ఇయర్ అని చెప్పొచ్చు. అలాగని పూర్తిగా సౌత్ సినిమాలకు దూరంగా కాదు. సరైన అవకాశాలు వచ్చాయంటే? కాదనకుండా పనిచేస్తుంది. అందులో ఎఆంటి సందేహం లేదు. ఎందుకంటే తమన్నా? ఒకే భాషకు పరిమితమై పనిచేసే నటి కాదు. అమ్మడి ముందు అన్ని భాషలు సమానమే.
