Begin typing your search above and press return to search.

మిల్కీబ్యూటీ మ‌రో బోల్డ్ అటెంప్ట్!

ఆ మ‌ధ్య ల‌స్ట్ స్టోరీస్ లో మాజీ ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌తో ఇంటిమేట్ స‌న్నివేశాల‌తో కాక పుట్టించిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   23 Aug 2025 8:30 PM IST
మిల్కీబ్యూటీ మ‌రో బోల్డ్ అటెంప్ట్!
X

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా త‌ప్పొప్పుల‌ను తెలుసుకుని జ‌ర్నీని ఎలా ప్లాన్ చేసుకుందో తెలిసిందే. ఆరంభంలో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు నో చెప్ప‌డంతో తానెంత‌గా న‌ష్ట‌పోయింద‌న్న‌ది ఓపెన్ అయింది. అటుపై త‌న‌ను తాను మార్చుకుని గ్లామ‌ర్ పాత్ర‌ల ప‌రంగా చెరిపేసిన హ‌ద్దులు ప్రేక్ష‌కుల‌కు తెలిసిందే. స‌న్నివేశం డిమాండ్ం చేసిందంటే త‌న‌లోని బోల్డ్ యాంగిల్ ని త‌ట్టిలేపిన సంద‌ర్భాలెన్నో. తెలుగు సినిమా అయినా? హిందీ చిత్ర‌మైనా సీన్ డిమాండ్ చేసిందంటే చేలేర‌గ‌డం త‌మ‌న్నా ప్ర‌త్యేక‌త‌గా మారిపోయింది.

తమన్నా ప్ర‌త్యేక‌త అదే:

ఆ మ‌ధ్య ల‌స్ట్ స్టోరీస్ లో మాజీ ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌తో ఇంటిమేట్ స‌న్నివేశాల‌తో కాక పుట్టించిన సంగ‌తి తెలిసిందే. అ్మ‌డు కిచెన్ రూమ్ లో చెల‌రేగిన వైనం? కుర్ర‌కారు గుండెల్లో ఇప్ప‌టికీ ప‌దిల‌మే. లస్ట్ స్టోరీస్ త‌ర్వాత త‌మ‌న్నా? క్రేజ్ కూడా రెట్టింపు అయింది. స‌రిగ్గా టాలీవుడ్ లో అవ‌కాశాలు త‌గ్గుతోన్న స‌మ‌యంలో వ‌చ్చిన ఛాన్స్ ఇది. అవ‌కాశం రావ‌డం...సిరీస్ స‌క్సెస్ అవ్వ‌డం అన్ని త‌మ‌న్నాకు క‌లిసొచ్చిన అంశాలు. త‌మ‌న్నా ఇంత అప్ డేట్ గా ఉంది కాబ‌ట్టే నేటి త‌రం హీరోయిన్ల‌తో పోటీగా అవ‌కాశాలు అందుకుంటోంది. బాలీవుడ్ కి పోటీగా ఎదురీదుతోంది. టాలీవుడ్ అటెన్ష‌న్ డ్రా చేస్తుంది.

కండీష‌న్స్ కి ఒకే:

తాజాగా త‌మ‌న్నాకి బాలీవుడ్ హారర్ అండ్ బోల్డ్ కంటెంట్ లో ఛాన్స్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. `రాగిణి ఎమ్ ఎమ్ ఎస్` ప్రాంచైజీ త‌మ‌న్నాని వెతుక్కునీ మ‌రి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. రాగినీ ఎమ్ ఎమ్ ఎస్ థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ కోసం మిల్కీ బ్యూటీకి మేక‌ర్స్ ట‌చ్ లో కి వ‌చ్చారుట‌. నేరుగా ఏక్తాక‌పూర్ త‌మ‌న్నాతో ట‌చ్ లో ఉంద‌ని తెలిసింది. త‌మ‌న్నా కూడా హిట్ ప్రాంచైజీ కావ‌డంతో సానుకూలంగా స్పందించిందిట‌. ఈ స‌మ‌యంలోనే ఏక్తా క‌పూర్ త‌న కండీష‌న్స్ అన్నింటిని ఓపెన్ గా త‌మ‌న్నా ముందు ఉంచిందిట‌.

బోల్డ్ స‌న్నివేశాల్లో త‌మ‌న్నా పీక్స్:

క‌మిట్ అయిన త‌ర్వాత మ‌ధ్య‌లో ఏ కార‌ణంగానూ త‌ప్పుకోకూడ‌ద‌ని..పూర్తిగా ద‌ర్శ‌కుల‌కు స‌హ‌క‌రించా ల‌ని..ముఖ్యంగా బోల్డ్ స‌న్నివేశాల విష‌యంలో పూర్తిగా త‌మ‌కు అనుకూలంగా ఉండాల‌ని కండీష‌న్ ఉందిట‌. అందుకు త‌మ‌న్నా కూడా అభ్యంత‌రం చెప్ప‌లేదని కండీష‌న్ ప్ర‌కారం ముందుకెళ్దామ‌ని చెప్పిందిట‌. ఈ సిరీస్ తో త‌మ‌న్నా బోల్డ్ స‌న్నివేశాల ప‌రంగా పీక్స్ చూసే అవ‌కాశం ఉందని అప్పుడే సోష‌ల్ మీడియాలో చ‌ర్చా మొద‌లైపోయింది.