అప్పుడు సన్నీ లియోన్.. ఇప్పుడు తమన్నా??
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ బ్యానర్ నుంచి వచ్చిన హర్రర్ ప్రాంచైజీ మూవీ 'రాగిణి MMS'. 2011లో వచ్చిన ఈ సినిమా ప్రాంచైజీలో వరుస సినిమాలు చేయాలని భావిస్తున్నారు.
By: Ramesh Palla | 9 Sept 2025 5:00 PM ISTబాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ బ్యానర్ నుంచి వచ్చిన హర్రర్ ప్రాంచైజీ మూవీ 'రాగిణి MMS'. 2011లో వచ్చిన ఈ సినిమా ప్రాంచైజీలో వరుస సినిమాలు చేయాలని భావిస్తున్నారు. 2014లో రాగిణి MMS ప్రాంచైజీలో రెండో భాగం వచ్చింది. మొదటి మూవీలో కైనాజ్ మోతివాలా, రాజ్ కుమార్ రావు, రజత్ కౌల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా రాగిణి MMS 2 సినిమాను తీసుకు వచ్చారు. మొదటి పార్ట్ కంటెంట్ కారణంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే, రెండో పార్ట్ మాత్రం సన్నీ లియోన్ కారణంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అంటారు. రాగిణి MMS ప్రాంచైజీలో వచ్చిన రెండో సినిమాలో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించగా, భూషన్ పటేల్ దర్శకత్వం వహించాడు.
రాగిణి MMS ప్రాంచైజీలో వరుస సినిమాలు
ఏక్తా కపూర్ నిర్మాణంలోనే రెండు పార్ట్‌లు వచ్చాయి. అందులో భాగంగానే ఇప్పుడు మూడో పార్ట్‌ను ఏక్తా కపూర్ నిర్మించేందుకు రెడీ అవుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. రాగిణి MMS 2 వచ్చి పదేళ్లు దాటింది. ఇప్పటికే ఈ ప్రాంచైజీలో రెండు మూడు సినిమాలు చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు రాగిణి MMS 3 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అయిందని, హీరోయిన్ ఎంపిక విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొదట ఈ ప్రాంచైజీ మూడో సినిమాకు హీరోయిన్‌గా నోరా ఫతేహీని ఎంపిక చేయడం జరిగింది. కథ చర్చలు సైతం ఆమె తో జరిగాయని అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాను చేయలేను అని చెప్పిందట.
నోరా ఫతేహీ హీరోయిన్‌గా రాగిణి MMS 3 మూవీ
నోరా ఫతేహీ ఈ సినిమాను చేసేందుకు రెడీగా లేని కారణంగా మళ్లీ కొత్త హీరోయిన్‌ను ఏక్తా కపూర్ అండ్ టీం వెతికే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏక్తా కపూర్‌కి సన్నిహితురాలుగా పేరు ఉన్న తమన్నా ను రాగిణి MMS 3 సినిమాకు హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ చివరి దశలో ఉంది. అదే సమయంలో హీరోయిన్ ఎంపిక విషయంలోనూ అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి సినిమాను ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్‌గా రూపొందించేందుకు గాను ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. హీరోయిన్ తమన్నా అయితే కచ్చితంగా కంటెంట్ విషయంలో మరింత శ్రద్ద అవసరం అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
తమన్నా హీరోయిన్‌గా హిట్ ప్రాంచైజీ మూవీ
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ అన్నట్లుగా మారి పోయింది. ఆకట్టుకునే అందంతో పాటు డాన్స్ విషయంలో మతి పోగొట్టగల సత్తా ఉన్న నటి తమన్నా, అంతే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ఇస్తే ఎంత దూరం అయినా తమన్నా వెళ్లేందుకు రెడీ అంటుంది. అందుకే ఏక్తా కపూర్ తన రాగిణి MMS 3 సినిమా కోసం తమన్నాను పరిశీలిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో పలువురు ఈ ప్రాంచైజీ మూవీకి తమన్నా తప్పకుండా మంచి ఆప్షన్ అవుతోంది అంటున్నారు.
రాగిణి MMS సినిమా అనగానే అడల్ట్ కంటెంట్, శృంగార సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. కనుక ఈ సినిమాలోనూ అదే తరహా సీన్స్ ఉన్నా తమన్నా వాటిని ఈజీగా చేస్తుంది అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తమన్నా ఈ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంటే ఇండస్ట్రీలో మరో ఐదేళ్ల పాటు కొనసాగే విధంగా ఆఫర్లు రావచ్చు అంటున్నారు.
