విజయ్ తో బ్రేకప్.. తమన్నా ఏమందంటే?
స్టార్ హీరోయిన్ తమన్నా ఓవైపు సినిమాలు.. మరోవైపు స్పెషల్ సాంగ్స్.. ఇంకోవైపు వెబ్ సిరీసులతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 15 Sept 2025 3:45 PM ISTస్టార్ హీరోయిన్ తమన్నా ఓవైపు సినిమాలు.. మరోవైపు స్పెషల్ సాంగ్స్.. ఇంకోవైపు వెబ్ సిరీసులతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడంతో పాటు ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది అమ్మడు. అనేక మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిందనే చెప్పాలి.
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఛాన్స్ లు అందుకుని సౌత్ స్టార్ హీరోయిన్ గా నిలిచిన అమ్మడు.. బాలీవుడ్ లో కూడా అదే స్టార్ డమ్ ను కంటిన్యూ చేస్తున్నారు. అయితే కెరీర్ బిగినింగ్ నుంచి ప్రేమాయణాలకు దూరంగా ఉన్న తమన్నా.. తాను నటించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో తనతో కలిసి యాక్ట్ చేసిన విజయ్ వర్మతో ప్రేమలో పడ్డారు.
ఆ తర్వాత ఇద్దరు కలిసి వెకేషన్స్ కు హాజరుకావడం, చెట్టాపట్టాలేసుకుని తిరగడం చేశారు. రిలేషన్ లో ఉన్నామని కూడా ప్రకటించారు. దీంతో పెళ్లి చేసుకుంటారని అంతా ఫిక్స్ అయ్యారు. ఇంతలో బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పుడు విజయ్ వర్మ.. దంగల్ నటి ఫాతిమాతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. తమన్నా మాత్రం ప్రాజెక్టులతో బిజీ.
వరుస సినిమాలు, వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం డయానా పెంటీతో కలిసి చేసిన డూ యు వాన్నా పార్టనర్ వెబ్ సిరీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె మాజీ ఫ్రెండ్ పై పరోక్షంగా కామెంట్స్ చేసినట్లు కనిపిస్తోంది. తన టూ యూ వాన్నా వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో కీలక వ్యాఖ్య చేసి వార్తల్లో నిలిచింది.
ప్రస్తుతం తన పరిస్థితిని ఎదుర్కొంటూనే వర్క్ అండ్ కెరీర్ పై ఫోకస్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. దీంతో ఇన్ డైరెక్ట్ గా బ్రేకప్ గురించి మాట్లాడింది. రీసెంట్ గా మరో ఇంటర్వ్యూలో మంచి లైఫ్ పార్ట్‌నర్ గా ఉండేందుకు ట్రై చేస్తున్నట్లు చెప్పిన తమన్నా.. ఎంతో పుణ్యం చేసుకుంటే తన లాంటి భార్య దొరికిందని భర్త ఆనందించాలని తెలిపింది.
అయితే అతను ఎవరో తనకు కూడా తెలియదు, త్వరలోనే ఆ అదృష్టవంతుడిని మీరంతా చూస్తారేమోనని తమన్నా చెప్పుకొచ్చింది. దీంతో తమన్నా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం జరిగింది. ఇంట్లో వాళ్లు మ్యాచ్ ఫిక్స్ చేశారమోనని మాట్లాడుకున్నారు. ఇప్పుడేమో మాజీ ఫ్రెండ్ వల్ల పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
