Begin typing your search above and press return to search.

ఆ టాలీవుడ్ హీరో వల్లే సాధ్యం.. డాన్స్ పెర్ఫార్మన్స్ పై తమన్నా కామెంట్స్!

అల్లు అర్జున్ ని డాన్స్ లో బీట్ చేసేవారు ఎవరు లేరు అంటారు ఆయన అభిమానులు. అల్లు అర్జున్ డాన్స్ మూమెంట్స్ ప్రతి ఒక్క సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయి.

By:  Madhu Reddy   |   25 Sept 2025 8:00 PM IST
ఆ టాలీవుడ్ హీరో వల్లే సాధ్యం.. డాన్స్ పెర్ఫార్మన్స్ పై తమన్నా కామెంట్స్!
X

అల్లు అర్జున్ ని డాన్స్ లో బీట్ చేసేవారు ఎవరు లేరు అంటారు ఆయన అభిమానులు. అల్లు అర్జున్ డాన్స్ మూమెంట్స్ ప్రతి ఒక్క సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంతోమంది ఈయన డ్యాన్స్ చూసే అభిమానులుగా మారతారు.అయితే అలాంటి అల్లు అర్జున్ కారణంగానే తాను కూడా డ్యాన్స్ లో పర్ఫెక్షన్ నేర్చుకున్నాను అంటోంది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు తమన్నా.. రీసెంట్ గా తమన్నా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ తన డాన్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే తనకి డ్యాన్స్ ఇంత పర్ఫెక్ట్ గా రావడానికి కారణం అల్లు అర్జున్ అంటూ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

తమన్నా ఇటీవల తాను నటించిన 'డు యూ వన్నా పార్ట్నర్' అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను అల్లు అర్జున్ కారణంగానే డాన్స్ లో ఉండే నైపుణ్యాలను నేర్చుకున్నాను. బద్రీనాథ్ సినిమా చేసే సమయంలో అల్లు అర్జున్ నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. ఆయన నుండే నేను డాన్స్ పర్ఫెక్షన్ నేర్చుకున్నాను. అల్లు అర్జున్ ఇచ్చిన సలహా.. డ్యాన్స్ ను మెరుగుపరచడంలో సహాయపడింది. అందుకే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ఒప్పుకుంటున్నాను" అంటూ తెలియజేసింది. అలా అల్లు అర్జున్ కారణంగా డాన్స్ లో ఉండే పర్ఫెక్షన్ నేర్చుకున్న తమన్నా.. ఇలా ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తోంది.

ముఖ్యంగా చాలామంది తమన్నా అభిమానులు ఆమెని సినిమాలో కీ రోల్ లో చూడడం కంటే.. సినిమాలో స్పెషల్ సాంగ్ లో చూడడానికే ఇష్టపడుతున్నారు. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు కూడా ఫ్యాన్స్ కోరిక మేరకు తమన్నాని ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లో తీసుకుంటున్నారు. అలా రీసెంట్గా బాలీవుడ్ లో వచ్చిన స్త్రీ 2 మూవీలో "ఆజ్ కీ రాత్" పాటతో సంచలనం సృష్టించడమే కాకుండా తాజాగా షారుక్ ఖాన్ తనయుడు తీసిన వెబ్ సిరీస్ లో "గఫూర్" అనే స్పెషల్ సాంగ్ తో అందరినీ ఆకట్టుకుంది. అలాగే కోలీవుడ్లో రజినీకాంత్ నటించిన జైలర్ మూవీలో "నువ్వు కావాలయ్యా" అనే పాటతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసింది తమన్నా. అలా తన డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ అలరిస్తూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది..

ఒక రకంగా చెప్పాలంటే తమన్నా స్పెషల్ సాంగ్ ల వల్లే ఆమెకు ఎక్కువగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అలా బద్రీనాథ్ సినిమాలో ఆమె డాన్స్ చూసిన చాలామంది ఫిల్మ్ మేకర్స్ స్పెషల్ సాంగ్స్ కి కూడా తమన్నాని ప్రిఫర్ చేస్తున్నారు.. ప్రస్తుతం తమన్నా సౌత్ లో ఎక్కువగా సినిమాలు చేయకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వరుస ప్రాజెక్టులు చేస్తోంది. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూనే మరికొన్ని సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తుంది. అలా తమన్నా చేతిలో ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.