వృద్ధాప్యం వ్యాధి కాదు.. అందమైన అనుభవం..
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ మహా అయితే 10,15 సంవత్సరాలు ఉంటుంది.
By: Madhu Reddy | 29 Oct 2025 10:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ మహా అయితే 10,15 సంవత్సరాలు ఉంటుంది. అది కూడా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటేనే అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతారు. మధ్యలో ఫ్లాప్స్ వచ్చినా ప్రేక్షకులను మెప్పించలేకపోయినా కూడా సినిమాల్లో ఆఫర్స్ రావు. అలాంటివారు చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతారు. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్స్ 10 సంవత్సరాలు ఉంటే చాలు.. 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెబితే చాలు అనే విధంగానే ఉండేవారు. కానీ ఇప్పటి జనరేషన్ హీరోయిన్లకి మాత్రం 40 ఏళ్లు దాటినా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
అప్పట్లో హీరోయిన్ కి 30 ఏళ్లు దాటితే అవకాశాలు రాకపోయేవి.కానీ ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్న హీరోయిన్ల కోసం కూడా మంచి మంచి పాత్రలు రాస్తున్నారు. అయితే తాజాగా హీరోయిన్ల ఏజ్ గురించి.. ఆఫర్స్ గురించి.. వృద్ధాప్యం గురించి.. 30 ఏళ్లలోపే పెళ్లి , పిల్లలు అన్న కాన్సెప్టుపై కూడా తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "గతంలో ఒక హీరోయిన్ కెరియర్ 30 ఏళ్ల వయసుతో ముగుస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు వయసు అనుభవంతో మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. ఒకప్పుడు నేను ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు 30 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకున్నాను.
కానీ ఆ 30 ఏళ్ల వయసులోనే నా జీవితం ఏంటో నాకు అర్థమైంది. అప్పుడే అన్ని తెలుసుకున్నాను.. దీనికి తోడు 35 ఏళ్ల వయసు దాటిన హీరోయిన్లకు కూడా ఇండస్ట్రీలో మంచి మంచి పాత్రలు వస్తున్నాయి.. దీనివల్ల ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.. అందుకే నేను పెట్టుకున్న ప్రణాళికను కూడా పక్కన పెట్టేసాను. వృద్ధాప్యం అనేది వ్యాధి కాదు. నిజానికి వృద్ధాప్యం అనేది చాలా అందంగా ఉంటుంది. మన అనుభవాలకు వృద్ధాప్యం ప్రతిబింబం లాంటిది" .అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.
తమన్నా 35 ఏళ్ల వయసు దాటినా కూడా ఇంకా ఇండస్ట్రీలో రాణిస్తోంది. సినిమాల్లో హీరోయిన్ రోల్స్ ఎక్కువగా రాకపోయినప్పటికీ స్పెషల్ సాంగ్ లు చేస్తూ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. అలా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాన్ స్టాప్ గా వర్క్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో విశాల్ భరద్వాజ్ డైరెక్షన్లో వస్తున్న 'ఓ రోమియో' అనే సినిమాలో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది.. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.. అలాగే పౌరాణిక థ్రిల్లర్ అయినటువంటి 'ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' అనే మూవీలో కూడా తమన్నా భాగం అవుతోంది.
