జునైద్ ఖాన్ కి జోడిగా తమన్నా.. ఇద్దరి ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్!
వాస్తవానికి ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ను కాస్త పక్కన పెడితే హీరోలు.. కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ సెట్ చేయడం పలు విమర్శలకు దారితీస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 14 Feb 2026 12:16 PM ISTఒకప్పుడు హీరో హీరోయిన్ కి ఏజ్ గ్యాప్ అనేది చాలా తక్కువ మాత్రమే ఉండాలి.. ముఖ్యంగా అమ్మాయితో పోల్చుకుంటే అబ్బాయిలు వయసులో పెద్దవాళ్లు అయి ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒకప్పుడు దర్శకులు కూడా ఇలాగే నటీనటులను ఎంచుకునే వాళ్ళు కూడా.. కానీ కాలం మారిన కొద్దీ పాత్ర డిమాండ్ చేస్తే హీరో కంటే హీరోయిన్ వయసు ఎక్కువగా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ను కాస్త పక్కన పెడితే హీరోలు.. కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ సెట్ చేయడం పలు విమర్శలకు దారితీస్తున్న విషయం తెలిసిందే.
అలాగే ఒకప్పుడు స్టార్ హీరోలతో సందడి చేసిన హీరోయిన్లు మళ్లీ వారి వారసులతో జతకట్టడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే అనుష్క, తమన్నా లాంటి హీరోయిన్లు మెగాస్టార్ తో స్టెప్పులు వేసి అటు రామ్ చరణ్ తో కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇకపోతే హీరోల సరసన చాలా తక్కువ వయసున్న అమ్మాయిలు ఏ విధంగా అయితే జోడి కట్టి స్క్రీన్ పై అలరిస్తున్నారో... ఇటివల కాలంలో హీరోయిన్స్ కూడా తమ కంటే వయసులో చిన్న వారితో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో వీరిద్దరూ జంటగా నటించిన విషయం తెలిసిందే. అటు అనుష్క వయసు 44 సంవత్సరాలు కాగా.. నవీన్ పోలిశెట్టి వయసు 36 సంవత్సరాలు.. దాదాపు 8 సంవత్సరాల వయసు తేడా అయినప్పటికీ వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు వయసులో తనకంటే చిన్నవాడితో రొమాన్స్ కి సిద్ధమయ్యింది మిల్కీ బ్యూటీ తమన్నా.. అదిరిపోయే స్టెప్పులు, తనదైన నటనతో అందరినీ అలరించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతోంది. అలా ఇప్పుడు తన జాబితాలోకి మరో ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం.. త్వరలో రాగిణి 3 సినిమా వస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ - తమన్నా జంటగా నటిస్తున్నట్లు సమాచారం.. హారర్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. శశాంక్ గోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కలయికతో ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ జోడి పరిచయం కాబోతోందని బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. వ్యక్తా కపూర్ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇకపోతే తమన్నా , జునైద్ ఖాన్ జంటగా నటించబోతున్నారు అని వార్తలు వస్తున్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తమన్నా వయసు 36 సంవత్సరాలు కాగా, జునైద్ ఖాన్ వయసు 32 సంవత్సరాలు. అయితే ఇద్దరి మధ్య నాలుగు సంవత్సరాల వయసు తేడా ఉండడం గమనార్హం. మరి ఇద్దరూ తెరపై ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి. ఇక జునైద్ ఖాన్ సాయి పల్లవి తో కలిసి ఏక్ దిన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా 2026 మే 1న విడుదల కాబోతోంది. సునీల్ పాండే దర్శకత్వం వహించారు.
