మాజీ ప్రియుడి లవ్ తో తమన్నా.. ఏంటీ సంగతి?
ఇటీవల ఆ జ్యువెలరీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, కాజల్ అగర్వాల్, వాణీ కపూర్, సమంత వంటి పలువురు స్టార్ హీరోయిన్లు హాజరై తమన్నాకు బెస్ట్ విషెస్ తెలిపారు.
By: M Prashanth | 3 Feb 2026 6:00 AM ISTమిల్కీ బ్యూటీ, స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు ఓటీటీ ప్రాజెక్టులు, ఐటమ్ సాంగ్స్ తో బిజీగా మారిన అమ్మడు.. ఇప్పుడు బిజినెస్ వైపు అడుగులు వేశారు. నటిగా మాత్రమే కాకుండా ఎంటర్ప్రెన్యూర్ గా కూడా తన ముద్ర వేయాలని నిర్ణయించుకున్న తమన్నా తాజాగా సొంత జ్యువెలరీ బ్రాండ్ ను ప్రారంభించింది.
ఇటీవల ఆ జ్యువెలరీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, కాజల్ అగర్వాల్, వాణీ కపూర్, సమంత వంటి పలువురు స్టార్ హీరోయిన్లు హాజరై తమన్నాకు బెస్ట్ విషెస్ తెలిపారు. డెనిమ్ థీమ్ తో స్టైలిష్ గా సాగిన ఆ వేడుకలో సెలబ్రిటీ సందడి కనిపించింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఓ స్పెషల్ గెస్ట్ ఎంట్రీ. ఆమెనే నటి ఫాతిమా సనా షేక్.
తమన్నా జ్యువెలరీ లాంచ్ ఈవెంట్ కు ఫాతిమా రావడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం.. ఆమె ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తుండడమే. గుస్తాఖ్ ఇష్క్ సినిమాలో కలిసి నటించిన తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
దీంతో తమన్నా ఈవెంట్ కు ఫాతిమా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడే విజయ్ వర్మ పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఎందుకంటే విజయ్ వర్మ ఎవరో కాదు.. గతంలో తమన్నా ప్రేమలో ఉన్న వ్యక్తే. లస్ట్ స్టోరీస్ 2 చిత్రీకరణ సమయంలో మొదలైన పరిచయం ప్రేమగా మారి, కొన్నేళ్ల పాటు ఆ జంట కలిసి కనిపించింది. పలు ఈవెంట్స్, పార్టీల్లో చేయి చేయి పట్టుకుని హాజరై అభిమానుల దృష్టిని ఆకట్టుకుంది.
తమ రిలేషన్ షిప్ గురించి ఇద్దరూ ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా మాట్లాడటం కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. అయితే కొన్ని నెలలుగా పరిస్థితులు మొత్తం మారిపోయాయి. వ్యక్తిగత కారణాల వల్ల తమన్నా–విజయ్ వర్మ విడిపోయారనే వార్తలు వినిపించాయి. ఇటీవల ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించకపోవడంతో బ్రేకప్ రూమర్లు మరింత బలపడ్డాయి. కానీ ఆ విషయంపై ఇద్దరిలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
అందుకే విజయ్ వర్మ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ గా ప్రచారం జరుగుతున్న ఫాతిమానే తమన్నా ఆహ్వానించడం ఇప్పుడు బీటౌన్ లో ఆసక్తికర చర్చలకు దారితీసింది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్రస్తుత ప్రేయసితో తమన్నా సందడి చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బాలీవుడ్ లో ఇలాంటి ఫ్రెండ్లీ రిలేషన్లు కామన్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి తమన్నా తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి కెరీర్, బిజినెస్ లపై ఫోకస్ పెట్టిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. జ్యువెలరీ లాంచ్ ఈవెంట్ వల్ల తమన్నా, విజయ్, ఫాతిమా షేక్ వార్తల్లో నిలిచారు.
