వయసు పెరగడం వ్యాధిలా భావిస్తున్నారా?
ఒకప్పుడు హీరోయిన్ గా కొనసాగాలంటే? వయసు పరిమితులుండేవి. 40 దాటాక హీరోయిన్ అవకాశాలివ్వడానికి దర్శకులు ముందుకొచ్చే వారు కాదు.
By: Srikanth Kontham | 31 Oct 2025 1:30 PM ISTఒకప్పుడు హీరోయిన్ గా కొనసాగాలంటే? వయసు పరిమితులుండేవి. 40 దాటాక హీరోయిన్ అవకాశాలివ్వడానికి దర్శకులు ముందుకొచ్చే వారు కాదు. వారు రాసిన కథలు..పాత్రలు 30-35 ఏళ్ల మధ్యలో వయసుగల వారినే డిమాండ్ చేసేవి. దీంత ఆ మధ్యలో ఉన్న వారినే తీసుకునేవారు. 40 ఏళ్లు వచ్చాయంటే హీరోయిన్ ఛాన్స్ కష్టంగా కనిపించేది. అయితే నేడు సన్నివేశం మారింది. వయసుతో సంబంధం లేకుండా హీరోయిన్ ఛాన్స్ లు అందుకుం టున్నారు. 50 ఏళ్లు, 60 ఏళ్ల హీరో సరసన 25 ఏళ్ల నటి నటిస్తోంది. ఆ కాంబినేషన్ లో రొమాంటిక్ సన్నివేశాలు డిమాండ్ చేస్తే వాటికి కూడా వెనుకాడటం లేదు.
దర్శకులు ఛాన్స్ తీసుకోవడంతోనే:
అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమైనా? వాటిని పట్టించుకోకుండా పరిశ్రమలు ముందుకెళ్తున్నాయి. హీరోలకు కూతుళ్లు వయసున్న వారితో నటిస్తున్నా? విమర్శ అన్నది కొన్ని రోజులకే పరిమితం. ఆ తర్వాత మళ్లీ మామూలే. ఆ సంగతి పక్కన బెడితే తాజాగా వయసు గురించి మిల్కీ బ్యూటీ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నేడు 30 ఏళ్లు వయసున్న మహిళల పట్ల సానుకూల మార్పు కనిపిస్తోందంది. వయసులను దృష్టిలో పెట్టుకుని దర్శకులు పాత్రలు రాయడం సంతోషించ దగ్గ విషయమన్నారు.
సహజంగా జరిగే ప్రక్రియ :
పరిశ్రమలో వచ్చిన మార్పులతో వయసు సంబంధం లేకుండా కొనసాగవచ్చు అని నమ్ముతున్నానన్నారు. అయితే అయితే కొందరు నటీమణులు మాత్రం వయసు పెరగడాన్ని ఓ వ్యాధిలా భావిస్తున్నారన్నారు. వయసు పెరిగితే ఏదో జరిగిపోతుందని భ్రమపడుతున్నారు. ఆ కారణంగా శరీరంలో ఎన్నో రకాల మార్పులొస్తున్నాయి. వయసు పెరిగింది అన్నది అప్పుడు ఇంకా తెలుస్తుంది. అలా ఎందుకు భయపడుతున్నారో తనకు అర్దం కాలేదన్నారు. వయసు పెరగడం అన్నది ప్రతీ ఒక్కరి జీవితంలో సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని ఆస్వాదించాలన్నారు.
పెళ్లైన భామలకు డిమాండ్ ఎక్కువే:
భయపడాల్సిన పని లేదన్నారు. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు పెళ్లైన వారికి ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాని భామలకంటే పెళ్లైన భామలకే పరిశ్రమలో డిమాండ్ కనిపిస్తోంది. వారైతే యువ హీరోలతో పాటు, సీనియర్ హీరోలకు యాప్ట్ అవుతారు? అన్న కోణంలో మేకర్స్ ఎంపిక చేస్తున్నారు. అప్పటికే నటనపై కొంత అనుభవం కూడా ఉండటంతో మేకర్స్ కు కొన్ని రకాల సన్నివేశాల పరంగా ఇబ్బందులు తప్పుతున్నాయి.
