పాత రోజులు వచ్చేస్తున్నాయ్.. ఇప్పటికైనా ఫేట్ మారుతుందా?
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని.. హీరోయిన్ గా ఒక స్టేజ్ కి ఎదిగిన తర్వాత.. సడన్గా ఫ్లాప్ లు పడితే మాత్రం అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి అనడంలో సందేహం లేదు.
By: Madhu Reddy | 18 Dec 2025 2:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని.. హీరోయిన్ గా ఒక స్టేజ్ కి ఎదిగిన తర్వాత.. సడన్గా ఫ్లాప్ లు పడితే మాత్రం అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి అనడంలో సందేహం లేదు. అయితే కొంతమంది హీరోయిన్గా అవకాశాలు రాకపోయేసరికి స్పెషల్ సాంగ్ లు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే ఒకప్పుడు తన అందంతో, నటనతో హీరోయిన్గా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న తమన్నా.. ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడంతో స్పెషల్ సాంగ్ లు చేస్తూ వాటికే పరిమితమైపోయింది.
ఒకప్పుడు హీరోయిన్ గా తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమెకు మళ్ళీ హీరోయిన్గా అవకాశాలు రావాలని అభిమానులు కోరుకున్నారు. అయితే అది మాత్రం నెరవేరలేదు. గత కొంతకాలంగా బాలీవుడ్, టాలీవుడ్ అంటూ వరుస చిత్రాలలో స్పెషల్ సాంగ్ లకే పరిమితమైంది. దీంతో తమన్నా ఇక స్పెషల్ సాంగ్ లు తప్పా హీరోయిన్గా చేయదా అంటూ ఎంతోమంది అభిమానులు కామెంట్ చేయగా.. ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికైనా ఈమె తలరాత మారుతుందా అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
అసలు విషయంలోకి వెళ్తే.. 35 సంవత్సరాల వయసున్న ఈమె ప్రస్తుతం ప్రముఖ నిర్మాత విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించనున్న ఓ రోమియో అనే సినిమాలో నటించబోతోంది. ఇందులో ప్రముఖ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇదివరకే కమీనే, హైదర్, సంగం వంటి చిత్రాలు వచ్చాయి. పైగా ఇవి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు సినిమా వస్తోంది.అందులో తమన్నా లీడ్ రోల్ పోషిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో షాహిద్ కపూర్, నానా పటేకర్, దిశా పటాని, తృప్తి డిమ్రి, అవినాష్ తివారీ వంటి స్టార్ లు నటిస్తూ ఉండగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి తమన్నా కూడా వచ్చి చేరింది. మొత్తానికి అయితే గత కొన్ని రోజులుగా స్పెషల్ సాంగ్ లతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు మళ్లీ హీరోయిన్గా అవతారం ఎత్తబోతోంది. కనీసం ఈ సినిమాతో నైనా ఈమె ఫేట్ మారుతుందేమో చూడాలి. ఒకవేళ ఈ సినిమా గనుక సూపర్ హిట్ అయ్యిందంటే మాత్రం మళ్లీ తమన్నాకు పాత రోజులు వచ్చినట్లే అంటూ కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇక తమన్నా విషయానికి వస్తే.. ఒకప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ , ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె.. ఆ తర్వాత కాలంలో కథల ఎంపిక విషయంలో తడబడి ఫ్లాప్స్ ను మూటగట్టుకుంది. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా ఈమెకు మంచి రోజులు రాబోతున్నాయి అనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ సినిమా ఫలితంపై ఈమె కెరియర్ ఆధారపడింది అని చెప్పవచ్చు.
