Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : సర్‌ప్రైజింగ్‌ లుక్‌లో తమన్నా

తమన్నా అందంతో పాటు నటనలో మంచి ప్రతిభ ఉన్న నటి, అంతే కాకుండా డాన్స్ విషయంలో చాలా మంది స్టార్‌ హీరోలతో పోటీ పడి మరీ డాన్స్ వేసిన ఘనత ఆమెకు దక్కింది.

By:  Ramesh Palla   |   11 Sept 2025 1:20 PM IST
పిక్‌టాక్ : సర్‌ప్రైజింగ్‌ లుక్‌లో తమన్నా
X

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. అప్పుడు ఎంత అందంగా ఉందో, కెరీర్‌ ఆరంభంలో ఎంత జోష్‌తో ఉండేదో ఇప్పుడు అదే స్థాయి అందంగా, అదే స్థాయి జోష్‌తో కనిపిస్తోంది. తమన్నా అందంతో పాటు నటనలో మంచి ప్రతిభ ఉన్న నటి, అంతే కాకుండా డాన్స్ విషయంలో చాలా మంది స్టార్‌ హీరోలతో పోటీ పడి మరీ డాన్స్ వేసిన ఘనత ఆమెకు దక్కింది. అలాంటి మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య కాలంలో కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. వ్యక్తిగతంగా లవ్‌ బ్రేకప్‌ మొదలుకుని స్టార్‌ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకోలేక పోవడం వరకు చాలా విషయంలో తమన్నా కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటుంది. అందం విషయంలో మునుపటితో పోల్చితే మరింతగా అందంగా తయారు అయినప్పటికీ ఈమెను ఫిల్మ్‌ మేకర్స్ సినిమాల్లో ఎంపిక చేయడం లేదు.


బరువు తగ్గిన అందాల తమన్నా

హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గడంతో తమన్నా తనలో మార్పులను చేసుకునేందుకు రెడీ అయింది. తమన్నా ఈ మధ్య కాలంలో బరువు తగ్గింది. కొన్ని నెలలుగా ఆమె బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఆమె ప్రయత్నం సఫలం అయింది. చాలా అందంగా మారిన మిల్కీ బ్యూటీ తమన్నాను చాలా మంది చూసి సర్‌ప్రైజ్ అవుతున్నారు. సన్నగా నాజూకుగా ఉండే తమన్నా ఇప్పుడు ఇంకాస్త సన్నగా భలే అందంగా తయారు అయింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా మిల్కీ బ్యూటీ గ్రీన్‌ డ్రెస్‌ లో కనిపించి చూపు తిప్పనివ్వలేదు. తమన్నాను ఈ మధ్య కాలంలో ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, మరికొందరు మాత్రం గ్రీన్‌ డ్రెస్‌లో తమన్నా మరీ ఇంత అందంగా ఉందేంట్రా బాబు అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తూ తమ అభిమానంను చాటుకుంటున్నారు.


గ్రీన్‌ డ్రెస్‌లో కన్నుల విందు చేసిన మిల్కీ బ్యూటీ

తమన్నా గ్రీన్‌ డ్రెస్‌ లో విభిన్నమైన హారం ధరించి, సింపుల్‌ లూజ్‌ హెయిర్ స్టైల్‌తో పెద్దగా మేకప్‌ లేకుండానే కనిపించింది. బ్రా లెస్ డ్రెస్‌ తో తమన్నా ఎప్పుడూ కన్నుల విందు చేస్తూ ఉంటుంది. ఈసారి కూడా మిల్కీ బ్యూటీ తమన్నా చూపులను తనవైపు తిప్పుకునేందుకు ఈ గ్రీన్‌ డ్రెస్‌ లో కన్నుల విందు చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌ ఉంటే నెటిజన్స్ ఫోటోలను ఏ స్థాయిలో వైరల్‌ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే తరహాలో తాజా తమన్నా ఫోటోలను నెటిజన్స్ తెగ లైక్ చేస్తూ షేర్‌ చేస్తున్నారు. తమన్నా అఫిషియల్‌గా ఈ ఫోటోలను తన ఇన్‌స్టా ఫేజీలో షేర్‌ చేయలేదు. కానీ మీడియా వారు తీసిన ఈ ఫోటోలను షేర్ చేసిన సమయంలో వైరల్‌ అవుతున్నాయి.

బాలీవుడ్‌లో తమన్నా వరుస సినిమాలు

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాదిలో ఇప్పటికే ఓదెల, రైడ్‌ 2 సినిమాలతో వచ్చిన తమన్నా ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ను దక్కించుకోలేక పోయాయి. అయినా కూడా ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఒక వైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, మరో వైపు ఈమె ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు, వెబ్‌ సిరీస్‌లు చేస్తోంది. హీరోయిన్‌గా తమన్నా కమర్షియల్‌ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ తమన్నాకి మాత్రం హీరోలకు జోడీగా సినిమాలు చేసే అవకాశం దక్కడం లేదు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఈమె ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగులో తమన్నా కొత్త సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలన్నీ హిందీ సినిమాలే కావడంతో రాబోయే ఏడాదిలో తమన్నా నుంచి తెలుగు ఫ్యాన్స్‌కి ట్రీట్‌ లేనట్లే. ముందు ముందు అయినా ఈమె సినిమాలతో వస్తుందేమో చూడాలి.