షారుక్ కొడుకు డెబ్యూ.. తమన్నా ఫుల్ సాంగ్ చూశారా?
సిరీస్ లో షారుక్ ఖాన్ నుంచి దిశా పటానీ వరకు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు నటించారు.
By: M Prashanth | 20 Sept 2025 11:05 AM ISTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ రీసెంట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో అవుతారని అంతా అనుకుంటే రొటీన్ కు భిన్నంగా డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చారు. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ తో దర్శకుడిగా మారారు. ఏడు ఎపిసోడ్ల ఆ సిరీస్.. ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
సిరీస్ లో షారుక్ ఖాన్ నుంచి దిశా పటానీ వరకు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు నటించారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కూడా క్యామియో రోల్ పోషించారు. అదే సమయంలో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాతో స్పెషల్ సాంగ్ ను మేకర్స్ చేయించారు. గఫూర్ అంటూ సాగే ఆ సాంగ్ ను ఇప్పటికే గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేశారు.
కొంతకాలంగా స్పెషల్ సాంగ్స్ తో ఓ రేంజ్ లో అదరగొడుతున్న తమన్నా.. గఫూర్ సాంగ్ లో కూడా అంతే రీతిలో సందడి చేశారు. ఫుల్ గ్రేస్ తో స్టెప్పులు వేసిన అమ్మడు.. తన అందచందాలతో మెప్పించారు. బాలీవుడ్ ఒకప్పటి విలన్లు అయిన శక్తి కపూర్, గుల్షన్ గ్రోవర్, రంజిత్ అందులో కనిపించారు. దీంతో సిరీస్ పై మంచి బజ్ క్రియేటైంది.
అయితే తీరా సిరీస్ స్ట్రీమింగ్ అయ్యాక.. తమన్నా సాంగ్ లేకపోవడం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారి తీసింది. ఎందుకు సాంగ్ డిలీట్ చేశారోనని అంతా డిస్కస్ చేసుకున్నారు. ఇంతలో మేకర్స్ రెస్పాండ్ అయ్యారు. గఫూర్ సాంగ్ సిరీస్ లో భాగం కాదని, దానిని కేవలం ప్రమోషనల్ వీడియోగా మాత్రమే చేశామని తెలిపారు.
ఆ తర్వాత పూర్తి ప్రమోషనల్ వీడియోను విడిగా విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్.. చెప్పినట్లు రిలీజ్ చేశారు. ప్రస్తుతం టాప్-10 ట్రెండింగ్ లో యూట్యూబ్ లో తమన్నా సాంగ్ సందడి చేస్తోంది. అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. సాంగ్ లో మిల్కీ బ్యూటీ సిజ్లింగ్ డ్రెస్సెస్ తో అదరగొట్టేశారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
ఒక్కో స్టెప్.. తమన్నా దుమ్మురేపిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తన గ్లామర్ తో కట్టిపడేస్తుందని అంటున్నారు. ఏదేమైనా సిరీస్ లో సాంగ్ ఉంటే ఇంకా బాగుండేదని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు యాడ్ చేసినా సూపర్ అని అంటున్నారు. అయితే మేకర్స్ మాత్రం ప్రమోషనల్ వీడియో అని అఫీషియల్ గా అనౌన్స్ చేసి.. గఫూర్ సాంగ్ ఫుల్ వీడియో షేర్ చేశారు. మరి మీరు చూశారా?
