Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో మూవీలో తమన్నా, ఈసారైనా అలా కనిపించేనా?

మిల్కీ బ్యూటీ తమన్నా సుదీర్ఘ కాలంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   7 Aug 2025 2:00 AM IST
స్టార్‌ హీరో మూవీలో తమన్నా, ఈసారైనా అలా కనిపించేనా?
X

మిల్కీ బ్యూటీ తమన్నా సుదీర్ఘ కాలంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈమె మొదటి సినిమా శ్రీ విడుదలై 20 ఏళ్లు పూర్తి అయింది. అయినా కూడా బిజీగానే సినిమాలు చేస్తూ ఉంది. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇప్పటికీ ఈమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి అంటే ఏ స్థాయిలో ఈమె ఇండస్ట్రీలో బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్‌ మీడియాలో ఈమె జోరు మామూలుగా లేదు. ఈమెకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ స్థాయిలో ఫాలోవర్స్ ఉంటారు. అంతే కాకుండా ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనే ఐటెం సాంగ్‌ అనగానే గుర్తుకు వచ్చే పేరుగా మారి పోయింది. తమన్నా ఐటెం సాంగ్‌ చేస్తే సూపర్‌ హిట్‌ ఖాయం అని చాలా మంది బలంగా నమ్ముతున్నారు.

ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా తమన్నా

ఈ మధ్య కాలంలో తమన్నా హీరోయిన్‌గా కంటే ఎక్కువగా ఐటెం సాంగ్స్ లో కనిపించింది. దాంతో ఆమె ఫ్యాన్స్ ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌ హీరోల సినిమాలో ఐటెం సాంగ్స్ చేయడం, అవి హిట్‌ కావడం బాగానే ఉంది. కానీ హీరోయిన్‌గా హీరోలతో సినిమాలు చేయడం ఎప్పుడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తమన్నా నుంచి మళ్లీ ఆ తరహా సినిమాలను ఆశిస్తున్నామని చాలా మంది అభిమానులు చెబుతూ ఉన్నారు. హీరోయిన్‌గా తమన్నా ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలు చేయాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఎట్టకేలకు ఐటెం సాంగ్‌ లో కాకుండా ఒక బాలీవుడ్‌ సినిమాలో తమన్నాకు ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం ఆ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

షాహిద్‌ కపూర్‌ రోమియోలో తమన్నా

విశాల్‌ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్‌ కపూర్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో తమన్నా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. మొదట ఈ సినిమాకు అర్జున్‌ ఉస్తార అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్‌ను రద్దు చేసి చివరకు 'రోమియో' అనే టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేయడం జరిగింది. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఆమెతో పాటు తమన్నా సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఐటెం సాంగ్‌ను బాలీవుడ్‌ మరో యంగ్‌ స్టార్‌ హీరోయిన్‌ దిశా పటానీ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

బాలీవుడ్‌లో వరుస ఆఫర్ల కోసం తమన్నా ప్రయత్నాలు

తమన్నాకు ఈ సినిమా చాలా కీలకంగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఓదెల సినిమా నిరాశను మిగల్చగా, మరో సినిమాలో ఐటెం సాంగ్‌ వల్ల పెద్దగా క్రేజ్ దక్కలేదు. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఈమె మూడు నాలుగు సినిమాలు చేస్తుంది. అందులో రోమియో ఒకటి. ఆ సినిమాలకు మంచి బజ్‌ రావాలంటే రోమియో సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలి, అంతే కాకుండా రోమియో సినిమాలో తమన్నాకు మంచి ప్రాధాన్యత ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే తమన్నా మరో మూడు నాలుగు ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.