ఏలియన్ వలలో చిక్కిన తమన్నా.. కాపాడేదెలా?
తనదైన గ్లామ్, డ్యాన్స్ మూవ్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే అందాల భామ తమన్నా ఇప్పుడు ఏలియన్ చేతికి చిక్కింది.
By: Sivaji Kontham | 21 Nov 2025 11:42 AM ISTతనదైన గ్లామ్, డ్యాన్స్ మూవ్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే అందాల భామ తమన్నా ఇప్పుడు ఏలియన్ చేతికి చిక్కింది. ఇప్పుడు ఏలియన్ వల నుంచి విడిపించడం ఎలా?.. ఇదిగో ఇక్కడ తమన్నా ఫ్యాషన్ సెన్స్ చూశాక, యూత్ ఫీలింగ్ ఇది.
ప్రయోగాలు చేయనిదే కొత్తదనం సాధ్యపడదు. ఫ్యాషన్ ప్రపంచంలో సృజనాత్మకతకు అంతూ దరీ లేదనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. తాజాగా తమన్నా ఎంపిక చేసుకున్న ఆల్ బ్లాక్ డిజైనర్ డ్రెస్ చూడగానే, ఎవరు ఈ ఏలియన్ సుందరి? అనే సందేహం కూడా కలుగుతుంది. ఇతర గ్రహం నుంచి ఈ భూమ్మిదికి వచ్చిందా? అంటూ మాట్లాడుకునేంత ట్రిక్కీగా కనిపిస్తోంది.
పండోరా గ్రహం మీద దిగిన ఏలియన్ కన్యలాగా కూడా కనిపిస్తోంది! అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి తమన్నా ప్రయోగం సూపర్‌హిట్ అయింది. ప్రస్తుతం ఈ యూనిక్ లుక్ ఇంటర్నెట్ తుఫాన్ లా దూసుకెళుతోంది.
తమన్నా కెరీర్ మ్యాటర్ కి వస్తే, అటు ఉత్తరాది సహా దక్షిణాది సినిమాలతో కెరీర్ రన్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం నాలుగు సినిమాలతో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా బిజీ బిజీగా ఉంది. అజయ్ దేవగన్ సరసన రేంజర్ అనే చిత్రంలో నటిస్తోంది. రోమియో, వివాన్ అనే చిత్రాలతోను బిజీగా ఉంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ డ్రామాలోను తమన్నా నటిస్తోంది.
