Begin typing your search above and press return to search.

అప్ప‌టి నుంచే త‌మ‌న్నా ముద్దుల వ‌ర‌ద‌!

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో న‌టీమ‌ణులంతా అవకాశాలు అందుకోవ‌డంలో జోరు చూపించ‌లేరు.

By:  Srikanth Kontham   |   16 Aug 2025 11:00 PM IST
అప్ప‌టి నుంచే త‌మ‌న్నా ముద్దుల వ‌ర‌ద‌!
X

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో న‌టీమ‌ణులంతా అవకాశాలు అందుకోవ‌డంలో జోరు చూపించ‌లేరు. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు సిద్దంగా ఉండ‌క‌పోవ‌డం..లిప్ లాక్ ..ఇంటిమేట్ స‌న్నివేశాల‌కు నోచెప్ప‌డం వంటి కార‌ణాల‌తో అవకాశాలు అనుకున్న విధంగా రావు. కొంత మంది న‌టీమ‌ణులు వెంట‌నే అలెర్ట్ అయి త‌మ‌ని తాము మౌల్డ్ చేసుకుంటారు. మ‌రికొంత మంది న‌టీమ‌ణుల విష‌యంలో ఆల‌స్యంగా జ‌రుగుతుందా ప్రక్రియ‌. క్లాసిక్ -డీసెంట్ రోల్స్ పోషించిన భామ‌లు ఒక్క‌సారిగా ట‌ర్నింగ్ తీసుకోవాలంటే ఇబ్బంది ప‌డుతుంటారు.

అవకాశాలు కోల్పోయిన న‌టి:

`మ‌హాన‌టి` త‌ర్వాత కీర్తి సురేష్ కి గొప్ప న‌టిగా పేరొచ్చింది. కానీ అవ‌కాశాలు రాలేదు. కార‌ణం ఏంటంటే? గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌కుండా మ‌డిక‌ట్టుకుని కూర్చుని ఉండ‌టం. ఇలాంటి స‌మ‌స్య‌ను చాలా మంది చూసిన వారే. ఇలాంటి లాజిక్ తెలియ‌క మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకూడా కెరీర్ ఆరంభంలో చాలా అవ‌కాశాలు కోల్పోయినట్లు గుర్తు చేసుకుంది. నాలుగైదు సంవ‌త్స‌రాల పాటు, త‌మ‌న్నా డీసెంట్ పాత్ర‌ల్లోనే క‌నిపిం చింది. గ్లామ‌ర్ గా మాత్రం అల‌రించ‌లేదు. అలాంటి అవ‌కాశాలు వ‌చ్చినా నో చెప్పిందిట‌.

స్టార్ లీగ్ లో చేరింద‌లా:

ఆ త‌ర్వాత విష‌యం తెలుసుకుని ఇండ‌స్ట్రీ త‌గ్గ‌ట్టు మారిన‌ట్లు తెలిపింది. ఆ మార్పు ఎప్ప‌టి నుంచి వ‌చ్చిందంటే? `100 ప‌ర్సంట్ ల‌వ్` నుంచి అని చెప్పొచ్చు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రంలో త‌మ‌న్నా మ‌హాల‌క్ష్మి పాత్ర‌తో ఏ రేంజ్ అందాల విందు చేసిందో తెలిసిందే. నాభి అందాలు, స్కిన్ షో ఎలివేష‌న్ తో ఓ ఊపు ఊపేసింది. `బ‌ద్రీనాద్`,` ఊస‌రవెల్లి`, `ర‌చ్చ` లాంటి చిత్రాల‌తో ఎలాంటి విజ‌యాలు అందుకుందో తెలిసిందే. వ‌రుస విజ‌యాల‌తో త‌మ‌న్నా జాత‌క‌మే మారిపోయింది. హీరోయిన్ గా స్టార్ లీగ్ లో చేరిపోయింది.

హీరోయిన్ కాన‌ప్ప‌టికీ సంతోషంగానే:

అప్ప‌టి నుంచి త‌మ‌న్నా లిప్ లాక్ స‌న్నివేశాల్లో ఎలాంటి రాజీ లేకుండా ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపింది. పాత్ర‌ల ప‌రంగా అలాంటి స‌న్నివేశాలు న‌టించాలని ద‌ర్శ‌కులు కోరిన‌ప్పుడు నో అనే మాట‌కు బ‌దులు ఎస్ అంటూ ప్ర‌యాణం సాగిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చింది. అలాగ‌ని హ‌ద్దు మీరి ఏ చిత్రంలోనూ న‌టించలేద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక పాత్ర‌లు...ఐటం పాట‌ల‌తో కెరీర్ సంతోషంగానే సాగుతుంద‌ని పేర్కొంది.