పింక్ లెహంగాలో తమన్నా.. కాలేజ్ బోయస్!
తాజాగా లక్మే ఫ్యాషన్ వీక్ వేదికగా తమన్నా ధరించిన పింక్ డిజైనర్ దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
By: Sivaji Kontham | 22 March 2026 9:29 AM ISTటాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తనదైన అందం.. అభినయంతో రెండు దశాబ్ధాల కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా, ఫ్యాషన్ ప్రపంచంలోనూ తమన్నా తనదైన ముద్ర వేస్తోంది. తాజాగా లక్మే ఫ్యాషన్ వీక్ వేదికగా తమన్నా ధరించిన పింక్ డిజైనర్ దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటో స్టోరీలో తమన్నా మెరుపులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మిల్కీ గ్లామర్ చూస్తుంటే ఇప్పటికీ కాలేజీ అమ్మాయిలాగే ఉందంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ భూమిక శర్మ రూపొందించిన ఆఫ్టర్ గ్లో కలెక్షన్‌లో భాగంగా తమన్నా ఈ పింక్ కలర్ మోడ్రన్ లెహంగాలో మెరిశారు. ఈ దుస్తుల గురించి తమన్నా స్పందిస్తూ ఈ డ్రెస్ ధరించడం చాలా సౌకర్యవంతంగా ఉందని తెలిపారు. ఇది ప్లేఫుల్ గా, మోడ్రన్ గా ఉంటూనే ఒక రకమైన ప్రశాంతతను, మెరుపును ఇస్తోందని తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే వారికి ఈ లుక్ ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఈ పింక్ లెహంగాపై చేసిన సునిశితమైన ఎంబ్రాయిడరీ వర్క్.. జతగా ఎంపిక చేసుకున్న మోడ్రన్ బ్లౌజ్ తమన్నా అందాన్ని రెట్టింపు చేశాయి. ఆధునికత, సంప్రదాయం కలగలిసిన ఈ లెహంగాలో ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులతో పాటు తోటి నటి కాజల్ అగర్వాల్ సైతం ఈ లుక్‌కు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ఓటిటి ప్లాట్‌ఫామ్స్ పై కూడా తన హవా కొనసాగిస్తూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ తన విలక్షణతను చాటుకుంటున్నారు.
ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే `పురుషన్`, షాహిద్ తో ఓ రోమియో, అజయ్ దేవగన్ తో రేంజర్ చిత్రాల్లో నటిస్తోంది. `వివాన్ - ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్` షూటింగ్ దశలో ఉంది. ఈ ప్రాజెక్టులపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాలతో పాటు నెట్‌ఫ్లిక్స్ , హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటిటి సంస్థల కోసం కొన్ని ఆసక్తికరమైన వెబ్ ఒరిజినల్స్‌లో నటించనున్నారని సమాచారం. వీటితో పాటు కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారట.
స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రియులను.. పవర్‌ఫుల్ పాత్రలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తమన్నా తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తోంది. అటు సినిమాల పరంగా, ఇటు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తూ ఈ మిల్కీ బ్యూటీ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
