Begin typing your search above and press return to search.

మిల్కీ వైట్ బ్యూటీ.. జస్ట్ వ్వావ్ స్టన్నింగ్

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

By:  Sivaji Kontham   |   10 May 2026 10:56 AM IST
మిల్కీ వైట్ బ్యూటీ.. జస్ట్ వ్వావ్ స్టన్నింగ్
X

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైట్ టాప్ - డెనిమ్ జీన్స్‌లో ఈ ముంబై భామ‌ అదిరిపోయే ఫోజులతో చెలరేగిపోయింది. లూజ్‌గా వదిలేసిన ఫ్రీస్టైల్ హెయిర్.. క్రీగంటి చూపులతో క‌వ్విస్తూ.. అలా సొగ‌సుగా గోళ్లు కొరుకుతూ మిల్కీ ఇచ్చిన ఫోజులు కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి. నడుము సొగసును ఎలివేట్ చేసేలా టాప్‌ను నెమ్మదిగా జరుపుతూ.. వెనక్కి చేతులు మడిచి సోగ్గా నిలబడి తమన్నా ఇచ్చిన స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ చినుగుల డెనిమ్ జీన్.. నడుము - థై భాగంలో కర్వ్‌లను హైలైట్ చేసేలా కత్తిరించిన తీరు ఆ ఫ్యాషనిస్టా ఐడియాకు ఫిదా అవ్వాల్సిందే.




ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. తమన్నా స్వయంగా `మై మామా గేవ్ ఇట్ టు మీ` అంటూ క్యాప్షన్ ఇవ్వగా... సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు. ప్రముఖ నటి కుశా కపిల, షిబానీ అక్తర్ వంటి వారు తమన్నా లుక్‌ను చూసి `అబ్సెస్డ్`, `జస్ట్ వ్వావ్.. స్టన్నింగ్` అంటూ కామెంట్లతో ముంచెత్తారు. ప్రియుడు విజయ్ వర్మతో బ్రేకప్ అయ్యాక తమన్నా తన పూర్తి సమయాన్ని కెరీర్‌పైనే వెచ్చిస్తోందని.., ఈ గ్లామర్ ఫోటోషూట్లు త‌న‌ కొత్త ప్రయాణానికి సంకేతాలని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.




వృత్తిపరంగా చూస్తే... తమన్నా ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ఆసక్తికరమైన దశలో ఉంది. ఒకవైపు కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూనే.. మరోవైపు నటిగా తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించే ప్రయోగాత్మక చిత్రాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సిద్ధాంత్ చతుర్వేది సరసన నటిస్తున్న `వి. శాంతారాం` బయోపిక్‌లో అలనాటి నటి జయశ్రీ పాత్రలో త‌మ‌న్నా కనిపించబోతుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన త‌మన్నా లుక్ పాతకాలపు సౌందర్యాన్ని గుర్తుచేస్తూ భారీ అంచనాలను పెంచింది.




2026 తమన్నాకు అత్యంత కీల‌క‌మైన ఏడాది. సిద్ధార్థ్ మల్హోత్రాతో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ `వీ-వన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్` పై చాలా హోప్స్ పెట్టుకుంది. త‌మిళ సినిమా పురుష‌న్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. వి.శాంతారామ్ టైటిల్ తో రూపొందుతున్న బ‌యోపిక్ లోను త‌మ‌న్నా కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన `ఓ రోమియో` బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యాన్ని సాధించ‌క‌పోయినా ఇందులో త‌మ‌న్నా అంద‌చందాల‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్ర‌స్తుతం కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదలకు ఆలస్యం కావడం అభిమానులను కొంత నిరీక్షణకు గురిచేస్తోంది. హిందీ `క్వీన్` చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన `దట్ ఈజ్ మహాలక్ష్మి`, నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించిన `బోలే చుడియాన్`' వంటి సినిమాలు పలు కారణాల వల్ల ల్యాబ్‌కే పరిమితమయ్యాయి. అయినా నిరుత్సాహపడకుండా ప్రస్తుతం తమిళంలో విశాల్ సరసన `పురుషన్` అనే చిత్రంతో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 2026లో ఈ చిత్రాలన్నీ వరుసగా థియేటర్లలో సందడి చేయనున్నాయి.