స్పెయిన్ లో మిల్కీ బ్యూటీ కష్టాలు.. ఎక్కడున్నా.. అది మాత్రం తప్పనంటూ!
మిల్కీ బ్యూటీగా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది తమన్నా.. శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. హ్యాపీడేస్ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చేసింది.
By: Madhu Reddy | 25 Oct 2025 5:00 AM ISTమిల్కీ బ్యూటీగా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది తమన్నా.. శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. హ్యాపీడేస్ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అందం, నటనతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈమె మేనిఛాయతో మిల్కీ బ్యూటీగా పేరు కూడా సొంతం చేసుకుంది. రాంచరణ్ , అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా ఒక్కరేమిటి టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కూడా కలిసిన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 18 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ స్టార్ స్టేటస్ ను అందుకుంటూ బిజీగా కొనసాగుతోంది. ఇకపోతే మూడు పదుల వయసు దాటినా ఇంకా వివాహానికి నోచుకోని ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ తన ఫిట్నెస్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈమె డైలీ దినచర్య చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోకమానరు. ఇదిలా ఉండగా తాజాగా స్పెయిన్ లో కూడా మిల్కీ బ్యూటీ కష్టాలు పడుతోందని తెలుస్తోం. ది అంతేకాదు ఎక్కడున్నా సరే ఫిట్నెస్ ముఖ్యమని దానికోసం ఎంత కష్టపడినా సంతోషమే అంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం సినిమాల షూటింగ్ నుండీ కాస్త విరామం దొరకడంతో.. విశ్రాంతి తీసుకోవడానికి స్పెయిన్ వెళ్ళింది. అయితే సెలవులను కూడా అలసత్వంగా మార్చడం సరికాదు అన్నట్టుగా తన జిమ్ కి సంబంధించిన వీడియోలను ఈమె ట్రైనర్ సిద్ధార్థ సింగ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బ్లాక్ కలర్ జిమ్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన తమన్నా.. అందులో డంబెల్స్ ఎత్తుతూ తెగ కష్టపడి పోయింది. అంతేకాదు కష్టమైన కసరత్తులు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఎక్కడ ఉన్నా సరే జిమ్ చేయడం మానను అంటూ స్పెయిన్ లో కూడా తెగ కష్టపడి పోతూ అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తానికి అయితే తమన్నా చేస్తున్న ఈ జిమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇకపోతే సాధారణంగా మిల్కీ బ్యూటీ తమన్న రోజూ వారీ జిమ్ లో భాగంగా.. బరువులు ఎత్తడం, అబ్స్, పంచెస్ వంటివి చేయడమే కాకుండా కార్డియో వ్యాయామాలు కూడా చేస్తుంది. శరీరానికి అనువైన ఫ్రీ హ్యాండ్ వ్యాయామాలు కూడా ఆమె దినచర్యలో భాగం. అలాగే జిమ్ కి వెళ్లలేని రోజుల్లో యోగా చేయడం లేదా ఈతకు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు తమన్నా. ఉదయం ప్రతిరోజు నాలుగు గంటలకే నిద్రలేచి వ్యాయామం చేస్తానని.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈమె కసరత్తులు చాలా తీవ్రంగా ఉంటాయని.. ఈమె ట్రైనర్ కూడా వెల్లడించారు అటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు ఆమె శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచడంలో సహాయపడుతుందని ఆయన స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండడానికి ఎంత కష్టపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
