వీడియో : ముంబై వీధుల్లో తమన్నా ఇలా..!
తమన్నా ముంబైలో ఉంటే ఎక్కువ శాతం రోడ్డు పై అలా నడుచుకుంటూ వెళ్తుందని స్థానికులు చెబుతూ ఉంటారు.
By: Ramesh Palla | 10 Oct 2026 10:30 AM ISTమిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు తమన్నా అందం పెరుగుతూనే ఉందని అభిమానులు ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కాలం మారినా, ఇండస్ట్రీలు మారినా తమన్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్‌కే పరిమితం అనుకున్న తమన్నా కోలీవుడ్ కు వెళ్లింది, అక్కడ మంచి విజయాలు సొంతం చేసుకుని బాలీవుడ్‌లోనూ సత్తా చాటింది. పాన్ ఇండియా హీరోల మాదిరిగానే పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ ఉంటే కచ్చితంగా అది తమన్నాకు నూరు శాతం సూట్ అవుతుందని ఆమె అభిమానులు అంటూ ఉంటారు. అలాంటి తమన్నా ముంబై వీధుల్లో తిరుగుతూ తన పని తాను చేసుకుంటూ, సింపుల్ జీవితాన్ని సాగించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది.
ముంబై వీధుల్లో తమన్నా....
తమన్నా ముంబైలో ఉంటే ఎక్కువ శాతం రోడ్డు పై అలా నడుచుకుంటూ వెళ్తుందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఆమె జిమ్‌కు వెళ్లినా, మార్కెట్‌కు వెళ్లినా మాస్క్ ధరించి నడుచుకుంటూ వెళ్తుందని ఆమె సన్నిహితులు కూడా అంటూ ఉంటారు. ఇంట్లోంచి బయటకు వెళ్తే కారులో అడుగు పెట్టే సెలబ్రిటీలు ఉన్నారు. చిన్న హీరోయిన్స్ చివరకు సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్స్ కూడా బయట తిరిగేందుకు ఆసక్తి చూపించరు. కానీ తమన్నా మాత్రం ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. ఒక సాధారణ మహిళ అన్నట్లుగానే ఆమె రోడ్డు పై అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆమె వెంట ఎవరూ ఉండరు. ఆమెను కొందరు గుర్తు పట్టి దగ్గరకు వచ్చినా నవ్వుతూ మందలించి ముందుకు సాగుతుంది. మాస్క్ ధరించడం వల్ల ఆమెను ఎక్కువ శాతం గుర్తు పట్టే అవకాశం ఉండదు. కనుక రోడ్డు మీద సులువుగా తమన్నా నడుచుకుంటూ వెళ్తుంది.
సోషల్ మీడియాలో తమన్నా వీడియో...
ఇటీవల తమన్నా ముంబైలో ఇలా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చాలా సింపుల్‌గా తమన్నా నడుస్తూ వెళ్తుండటం చూసి చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆమె సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. ఇంత సింపుల్‌గా ఒక సెలబ్రిటీ ఎలా ఉండగలుగుతున్నారు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఆమె నెట్ వర్క్ దాదాపుగా రూ.125 కోట్లు ఉంటుందని ముంబై వర్గాల వారి అంచనా. అయినా కూడా ఆమె సింపుల్‌గానే లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉన్నప్పటికీ ఆమె మాత్రం ఎక్కువగా లోకల్ లో నడుచుకుంటూ వెళ్లడం లేదంటే ఆటోలో ప్రయాణించడం చేస్తూ ఉంటారని స్థానికులు, ఆమెకు సన్నిహితంగా ఉండే వారు మాట్లాడుతూ ఉంటారు.
ది వాన్ మూవీతో హిట్ కొట్టిన తమన్నా...
ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఆమె నటించిన హిందీ సినిమా ది వాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ హర్రర్ కాన్సెప్ట్ మూవీ మొదట మిక్స్‌డ్ రివ్యూలు దక్కించుకున్నప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. పెట్టిన పెట్టుబడికి డబుల్ అమౌంట్ వచ్చిందని, అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించింది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. దాంతో తమన్నాకు హిందీలో ఒక మంచి హిట్ పడిందని అభిమానులు అంటున్నారు. తమన్నా చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో ఎక్కువ హిందీ సినిమాలు కాగా ఒకటి రెండు తమిళ సినిమాలు సైతం ఉన్నాయి. తెలుగులో తమన్నా కనిపించి చాలా రోజులు అయింది. ఆమె రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమన్నా టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని అభిమానులు ఆశ పడుతున్నారు. మరి అది సాధ్యమా అనేది చూడాలి.
