పింక్ బ్యూటీనా! మిల్కీ బ్యూటీనా?
పాల నురుగు అందాలతో కుర్రకారు కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటివ్వడంలో తమన్నా తర్వాతే. అయితే ఇప్పుడు పింక్ లో తమన్నా లుక్ ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.
By: Sivaji Kontham | 3 Oct 2025 7:00 AM ISTమిల్కీ వైట్ బ్యూటీగా తమన్నా భాటియా అభిమానుల హృదయాల్లో దాగి ఉన్నారు. పాల నురుగు అందాలతో కుర్రకారు కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటివ్వడంలో తమన్నా తర్వాతే. అయితే ఇప్పుడు పింక్ లో తమన్నా లుక్ ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.
ప్రఖ్యాత బల్గారీ డిజైనర్ ఆభరణాల ప్రచారంలో నిమగ్నమైన తమన్న ప్రత్యేకించి పింక్ డ్రెస్ - ఊదా రంగు ఆభారణాల కాంబినేషన్ తో ర్యాంప్ పై ప్రత్యేకంగా మెరిసిపోయింది. మత్తు కళ్లతో తమన్నా మేని విరుపులు యువకుల హృదయాలను కొల్లగొట్టాయి.
తమన్నా నిజంగానే మైండ్ బ్లాకు! అంటూ అభిమానులు ఈ ఫోటోషూట్ కి కితాబిచ్చేస్తున్నారు. ఎంపిక చేసుకున్న పింక్ దుస్తులు, దానికి కాంబినేషన్ గా వంగపువ్వు రంగు నెక్లెస్ తో తమన్నా ఎంతో స్పెషల్ గా ఉందని అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. బల్గారీ బ్రాండ్ ప్రమోషన్స్ కి తమన్నా ఉత్తమమైన ఎంపిక అని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా ఫోటోషూట్ ఇంటర్నె ట్ ని ఊపేస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... ఇటీవల `రేంజర్` చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కథానాయకుడు కాగా తమన్నా పాత్రకు ప్రత్యేకత ఉందని సమాచారం. అలాగే రోమియో అనే చిత్రంలోను తమన్నా నటిస్తోంది. రోహిత్ శెట్టితో ఓ సినిమాకి కమిటైంది. `వి-వాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్` అనే చిత్రంలోను తమన్నా నటిస్తోంది.
