Begin typing your search above and press return to search.

తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా? ఆ కామెంట్స్ వెనుక అర్థమేంటి?

స్టార్ హీరోయిన్‌, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన పర్సనల్ లైఫ్ పై చేసిన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు.

By:  M Prashanth   |   5 May 2026 5:00 AM IST
తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా? ఆ కామెంట్స్ వెనుక అర్థమేంటి?
X

స్టార్ హీరోయిన్‌, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన పర్సనల్ లైఫ్ పై చేసిన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. ప్రేమ, పెళ్లి, రిలేషన్ షిప్ పై ఆమె అభిప్రాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి. సాధారణంగా ప్రేమలో ఒకసారి ఫెయిల్ అయితే మళ్లీ ఆ దారిలో వెళ్లడానికి చాలా మంది వెనుకంజ వేస్తారు. అయితే తమన్నా మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారనే చెప్పాలి.

జీవితంలో ప్రేమ అనేది ఒక్క వ్యక్తితో మాత్రమే పరిమితం కావాల్సిన అవసరం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు కొత్త రిలేషన్ ను వెతుక్కోవడం సహజమేనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని సార్లైనా ప్రేమలో పడే అవకాశం ఉంటుందని, ప్రేమను ఒకే వ్యక్తికి కట్టిపడేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

ముఖ్యంగా సంబంధాలు మన ఫ్రీడమ్ కు బ్రేక్ వేసేవిగా కాకుండా, మన డెవలప్మెంట్ కు హెల్ప్ చేసేలా ఉండాలని పేర్కొన్నారు. ఆ కామెంట్స్ ఆమె పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయడమే కాకుండా, మోడ్రన్ రిలేషన్ పై ఆమె ఆలోచనా విధానాన్ని క్లియర్ గా తెలియజేస్తున్నాయి. కొంతకాలంపాటు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో మునిగితేలగా, అనంతరం బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తమన్నా పూర్తిగా తన కెరీర్‌ పై దృష్టి సారించారు.

వరుస సినిమాలతో బిజీగా మారిన ఆమె, వ్యక్తిగత విషయాలపై పెద్దగా రెస్పాండ్ అవ్వక పోయినా, తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చకు దారి తీశాయి. ఇక పెళ్లి విషయానికి వస్తే, ప్రస్తుతం తనకు వివాహంపై ఎలాంటి ఆలోచన లేదని తమన్నా స్పష్టంగా తెలిపారు. తన కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ, సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకుంటానని ఆమె వెల్లడించింది. దీంతో పెళ్లి పై వస్తున్న రూమర్లకు కూడా ఫుల్‌ స్టాప్ పడినట్టే అయింది.

అయితే ఇండస్ట్రీలో తమన్నా- విజయ్ వర్మ జంటకు ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత కూడా ఈ జంట గురించి రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తమన్నా తరచూ తన వ్యక్తిగత జీవితంపై క్లారిటీ ఇస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఊహాగానాలు ఆగడం లేదు. తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఆమె మళ్లీ ప్రేమలో పడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ తమన్నా కామెంట్స్ ను గమనిస్తే, ఆమె ప్రస్తుతం పర్సనల్ ఫ్రీడమ్ ను ఆస్వాదిస్తూ, కెరీర్‌ పైనే ఫోకస్ పెట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవల పలు విభిన్న జోనర్లలో నటిస్తూ తనదైన ముద్ర వేస్తోంది తమన్నా. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ, ఇప్పటికీ అదే గ్లామర్, క్రేజ్‌ ను కొనసాగిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తానికి ప్రేమ, రిలేషన్ షిప్స్ పై తమన్నా చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.