వీడియో : తమన్నా సరదా, ఆపై బాధ...!
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.
By: Ramesh Palla | 2 July 2026 7:17 PM ISTమిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. పై పెచ్చు అందం విషయంలో యంగ్ హీరోయిన్స్‌తోనూ ఈ అమ్మడు పోటీ పడుతోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో ఎంత అందంగా అయితే ఉందో అంతే అందంగా ఇప్పటికీ మిల్కీ బ్యూటీ తమన్నా ఉందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉంటారు. తమన్నా సాధారణంగానే సోషల్ మీడియాలో చిన్న వీడియో, ఫోటో పెడితే వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది తాజాగా ఆమె వర్షంలో తడిసిన వీడియో పెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో మిల్కీ బ్యూటీ తమన్నా రెయిన్ సాంగ్ వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఈసారి తమన్నా రియల్ రెయిన్‌లో తడిచి, ఆ వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమన్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్...
వర్షంలో సరదాగా తడుస్తూ, వాతావరణంను ఎంజాయ్ చేయడం వీడియోలో చూడవచ్చు. తమన్నా రెయిన్ ను ఆస్వాదిస్తూ, తడిచి ఎంజాయ్ చేస్తున్న వీడియో కావడంతో చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ఎక్కువ మంది చూశారు. నెట్టింట తమన్నా అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు ఆ వీడియోను షేర్ చేశారు. సాధారణంగా హీరోయిన్స్ ఇలా రెయిన్‌లో తడిచి ఆరోగ్యం పాడు చేసుకోవాలి అనుకోరు. కానీ తమన్నా మాత్రం నేచర్‌ను ఎంజాయ్ చేసే ఉద్దేశంతో ఇలా వర్షంలో తడిచి సరదా తీర్చుకుంది. అయితే వర్షంలో తడిస్తే సరదాగా ఉంటుంది, కానీ ఆ తర్వాత ఇబ్బందులు తప్పవు. వర్షంలో తడిచినంత సేపు బాగానే ఉంటుంది. ఆ తర్వాత బాగా చలి పెడుతుంది. తమన్నా సైతం వీడియో చివర్లో చలికి వణుకుతున్నట్లుగా చూడవచ్చు. సరదాకు పోతో ఇలా బాధ పడాల్సి వస్తుందని కొందరు సరదా కామెంట్స్ చేస్తున్నారు.
ఓదెల 2 సినిమాతో తమన్నా...
తమన్నా సినిమాల విషయానికి వస్తే ఆ మధ్య కాస్త స్లో అయినట్లుగా అనిపించినా తిరిగి పుంజుకుంది. మిల్కీ బ్యూటీ తమన్నా తన అందంతో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది. గత ఏడాది తమన్నా నటించిన ఓదెల 2, రైడ్ 2 సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు తమన్నా కెరీర్‌ను జోష్ తో ముందుకు తీసుకు వెళ్లడం లో విఫలం అయ్యాయి అని చెప్పక తప్పదు. కానీ ఓదెల 2 సినిమాలోని తమన్నా యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు తమన్నా కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా మరోసారి ఓదెల 2 సినిమాతో నిరూపితం అయ్యిందని ఆమె అభిమానులు మాట్లాడుకున్నారు. ఇక బాలీవుడ్ మూవీ రైడ్ 2 విషయంలో తమన్నాకు నిరాశే మిగిలింది. సినిమాలో తమన్నా పాత్ర పరిమితం కావడంతో ఫలితంతో సంబంధం లేకుండా ఆమెకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌తో...
గత ఏడాది సినిమాల విషయంలో కాస్త నిరుత్సాహం ఎదురైనప్పటికీ ఈ ఏడాదిలో తమన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు తమన్నా చేతిలో ఉన్నాయి. అందులో హిందీ సినిమాలు అయిదు కావడం విశేషం. ఒక తమిళ సినిమాను సైతం తమన్నా చేస్తుంది. రాగిణి 3 సినిమాతో తమన్నా బాలీవుడ్‌లో కచ్చితంగా స్టార్‌డం దక్కించుకుంటుందని, నాలుగు అయిదు ఏళ్లు వరుస సినిమా ఆఫర్లు రాబట్టుకునే రేంజ్‌లో రాగిణి 3 సినిమా ఉండబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా వచ్చిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకుంటూ వస్తుంది. నటిగానే కాకుండా ఐటెం సాంగ్స్‌లోనూ చేసేందుకు తమన్నా మొదటి నుంచి ఓకే చెబుతూనే ఉంది. అందుకే ముందు ముందు టాలీవుడ్‌లోనూ తమన్నాను ఐటెం సాంగ్స్‌లో చూడవచ్చు.
