Begin typing your search above and press return to search.

పవర్ఫుల్ పాత్రలో తమన్నా.. ఇప్పటికైనా కంబ్యాక్ ఇస్తుందా?

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎక్కువగా బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   22 Jan 2026 11:45 AM IST
పవర్ఫుల్ పాత్రలో తమన్నా.. ఇప్పటికైనా కంబ్యాక్ ఇస్తుందా?
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది తమన్నా భాటియా. ఒకప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ,అల్లు అర్జున్ లాంటి అగ్ర కథానాయకుల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే స్పెషల్ సాంగ్స్ లో చేయడం మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో చేసిన తప్పిదం ఆమెకు మళ్ళీ మునుపటి వైభవాన్ని అందించలేదనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.

నిజానికి ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన నయనతార, త్రిష, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఇప్పటికీ వరుస సినిమాలలో హీరోయిన్లుగా దూసుకుపోతుంటే.. తమన్న మాత్రం ఇంకా స్పెషల్ సాంగ్ లకే పరిమితం అవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె ఖాతాలో ఒక్క పవర్ఫుల్ పాత్ర పడింది అంటే తనను తాను నిరూపించుకొని మళ్ళీ కం బ్యాక్ అవుతుందని అభిమానులు ఆశిస్తూ ఉండగా వారి కోరిక మేరకు తమన్న ఇప్పుడు జాక్పాట్ కొట్టిందని చెప్పవచ్చు .

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎక్కువగా బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో జాన్ అబ్రహం హీరోగా 'మారియా ఐపీఎస్' అనే ఒక బయోపిక్ తీస్తున్నారు. ఈ సినిమా బలమైన భావోద్వేగాల చుట్టూ తిరుగుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు.

1993లో డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఆఫీసర్ గా పని చేసిన రాకేష్ మారియా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడుతోంది. ముంబై వరుస పేలుళ్ల కేసును పరిష్కరించడంలో రాకేష్ మారియా కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా 2003 గేట్వే ఆఫ్ ఇండియా, జవేరి బజార్ జంట పేలుళ్ల కేసును ఛేదించడానికి ఈయన ధైర్యం ఎంతో సహాయపడింది. టాక్సీలలో పేలుడు పరికరాలను అమర్చిన జంటతో సహా మొత్తం ఆరుగురు నిందితులను ఆయన అరెస్టు చేశారు.

ఇలాంటి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ బయోపిక్ 'మారియా ఐపీఎస్' అనే టైటిల్ తో రాబోతోంది. ఇప్పుడు ఈ చిత్రంలో మారియా ఐపీఎస్ పాత్రలో జాన్ అబ్రహం నటిస్తుండగా.. ఆయన భార్య పాత్రను తమన్నా భాటియా పోషిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆమె పాత్ర గణనీయంగా మరింత ప్రభావవంతంగా ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. అలాంటి పవర్ఫుల్ పాత్రతో రాబోతున్న ఈ చిత్రం 2026 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఒకే ఒక అతిధి పాత్ర ఉందని కూడా సమాచారం. అయితే ఆ ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై ఇండోర్లో జరుగుతున్నట్లు సమాచారం.

మొత్తానికైతే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మరింత పవర్ఫుల్ పాత్ర పోషించడానికి సిద్ధమైంది తమన్న. ఒకవేళ ఈ సినిమా గనుక సూపర్ హిట్ అయింది అంటే మాత్రం మళ్లీ పాత తమన్నా తిరిగి వచ్చినట్టే అని అభిమానులు ఆశిస్తున్నారు. మరి తమన్నాకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.