Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: దివి నుంచి దిగి వ‌చ్చిన మిల్కీ దేవ‌త‌

తాజాగా త‌మ‌న్నా భాటియా అంద‌మైన డిజైన‌ర్ దుస్తుల‌లో రాణిని త‌ల‌పించిన ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

By:  Sivaji Kontham   |   15 Nov 2025 3:00 AM IST
ఫోటో స్టోరి: దివి నుంచి దిగి వ‌చ్చిన మిల్కీ దేవ‌త‌
X

భారతీయ సంప్రదాయం, సమకాలీన శైలి విలక్షణమైన కలయికకు చాలా కాలంగా తెలిసిన‌ లగ్జరీ ఎథ్నిక్ లేబుల్ KALKI కోసం త‌మ‌న్నా భాటియా స్పెష‌ల్ షూట్ ఇంటర్నెట్ ని ఒక రేంజులో ఊపేస్తోంది. మిల్కీ వైట్ సోయ‌గం ప్ర‌చార‌క‌ర్త‌గా ప‌ని చేస్తుండ‌డం నిజానికి క‌ల్కి బ్రాండ్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింద‌ని అంగీక‌రించాలి. తాజాగా త‌మ‌న్నా భాటియా అంద‌మైన డిజైన‌ర్ దుస్తుల‌లో రాణిని త‌ల‌పించిన ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.





త‌మ‌న్నా రెండు విభిన్న‌మైన రంగుల‌లో ఉన్న డిజైన‌ర్ దుస్తుల‌ను ఎంపిక చేసుకుంది. వీటిలో బ్లాక్ అండ్ బ్లాక్ క్రిస్ట‌లైన్ డిజైన్ తో రూపొందించిన భారీ ఆఫ్ షోల్డ‌ర్ లెహంగా, అలాగే పింక్ రంగులో ఎంతో అందంగా కుదిరిన స్పెష‌ల్ ఆఫ్ షోల్డ‌ర్ లెహంగాలోను త‌మ‌న్నా చాలా ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంది.





ఈ క‌లెక్ష‌న్స్ నిజంగా పార్టీ వేర్ కాదు.. ఇవి ఒక కుటుంబ‌ భావోద్వేగం. నేటిత‌రాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన క‌ల్కి. నేటి వధూవరులకు స‌రిప‌డేలా.. నేటిత‌రం అధునాత‌న‌ జీవనశైలికి స‌రిపోయే సాంప్ర‌దాయ‌క దుస్తులుగా దీనిని చూడాలి.





ఓవ‌రాల్ గా త‌మ‌న్నా లుక్ వీక్షించాక‌, దివి నుంచి దిగి వ‌చ్చిన మిల్కీ దేవ‌త అంటూ ఒక అభిమాని కితాబిచ్చాడు. త‌మ‌న్నా ఈ కొత్త గెట‌ప్ ల‌లో ఎంతో అందంగా ఉంద‌ని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. లెక్క‌లేన‌న్ని ల‌వ్- హార్ట్ ఈమోజీల‌ను అభిమానులు షేర్ చేసారు.





త‌మ‌న్నా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, అటు ఉత్త‌రాది స‌హా ద‌క్షిణాది సినిమాల‌తో కెరీర్ ర‌న్ కొన‌సాగిస్తోంది. ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌తో మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా బిజీ బిజీగా ఉంది. అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న రేంజ‌ర్ అనే చిత్రంలో న‌టిస్తోంది. రోమియో, వివాన్ అనే చిత్రాల‌తోను బిజీగా ఉంది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ యాక్ష‌న్ డ్రామాలోను త‌మ‌న్నా న‌టిస్తోంది.