తమన్నాని పక్కన పెట్టేశారా..?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది. నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే గ్లామర్ షో పరంగా కూడా తమన్నా తగ్గేదేలే అనిపించుకుంది.
By: Ramesh Boddu | 13 Aug 2025 10:58 AM ISTమిల్కీ బ్యూటీ తమన్నా భాటియా దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది. నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే గ్లామర్ షో పరంగా కూడా తమన్నా తగ్గేదేలే అనిపించుకుంది. హీరోయిన్ గానే కాదు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా చేసి మెప్పించింది తమన్నా. ఐతే సౌత్ లో ముఖ్యంగా తెలుగులో తమన్నాకి మంచి క్రేజ్ ఏర్పడింది. శ్రీతో తెలుగు కెరీర్ మొదలు పెట్టిన తమన్నా హ్యాపీడేస్ నుంచి తిరిగి చూసుకోలేదు.
F 2, F 3 సినిమాల్లో..
ఈ ఇయర్ కూడా ఓదెల 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమన్నా. సంపత్ నంది నిర్మించిన సినిమా కాబట్టి తమన్నా ఆ మూవీ చేసింది. ఐతే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా తమన్నాని సైడ్ చేసేశారు. F 2, F 3 సినిమాల్లో నటించి మెప్పించింది తమన్నా.. ఇక కుదిరితే సీనియర్ హీరోలతో నటించడమే తప్ప మళ్లీ పాన్ ఇండియా స్టార్స్ తో జత కట్టే ఛాన్స్ ఉన్నట్టు కనిపించట్లేదు.
ఓదెల 2 తర్వాత తమన్నా తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు తమన్నా.. అమ్మడు బాలీవుడ్ లో మాత్రం బాగానే అవకాశాలు సంపాదిస్తుంది. ఇప్పటికే అక్కడ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. తమన్నా కేవలం సినిమాలే కాదు వెబ్ సీరీస్ లు కూడా చేసేందుకు సై అనేస్తుంది. అందుకే అమ్మడు అక్కడ బిజీగా ఉంది. ఇక సౌత్ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని భావిస్తున్న తమన్నా తన పూర్తి ఫోకస్ బాలీవుడ్ మీదే పెట్టాలని చూస్తుంది.
తమన్నాకి పర్ఫెక్ట్ అంటే చాలు..
తమన్నాకు తెలుగులో ఆఫర్లు రావా అంటే ఆమెను కాదన్నట్టు కాదు కానీ ఏదైనా ఒక రోల్ ఇది తమన్నాకి పర్ఫెక్ట్ అంటే చాలు ఆమె దాకా వెళ్తుంది. అంతేకాదు ఏదైన సినిమాలో స్పెషల్ సాంగ్ అయినా కూడా తమన్నా ఓకే అనేస్తుంది. సో టాలీవుడ్ లో ప్రస్తుతం అమ్మడికి అవకాశాలు లేవు కానీ మళ్లీ తమన్నా కంబ్యాక్ ఇస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.
బాలీవుడ్ లో ఐతే తమన్నాకి అవకాశాలు ఇస్తున్నారు. అక్కడ హీరోయిన్ గా కాకపోయినా తమన్నా ఏదో ఒక ఛాన్స్ అనుకుంటూ చేస్తుంది. హిందీలో ఎలాంటి రోల్ చేసినా సరే అది కెరీర్ కి ప్లస్ అవుతుందని భావిస్తుంది తమన్నా.. ఈమధ్య సినిమాల కన్నా డేటింగ్ న్యూస్ లతో ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న తమన్నా మళ్లీ తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెడుతుందని తెలుస్తుంది.
