Begin typing your search above and press return to search.

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

తమన్నా తన జ్యువెలరీ స్టోర్‌లో తొలి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ధరించిన రెడ్ అనార్కలి, పలాజో, మియు మియు సన్ గ్లాసెస్, డైమండ్ ఇయర్ రింగ్స్, కార్టియర్ బ్రాస్‌లెట్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె లుక్‌లోని వస్తువుల మొత్తం విలువ రూ.10 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం.

By:  Madhu Reddy   |   10 Nov 2026 3:09 PM IST
బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే
X

శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై హ్యాపీడేస్ సినిమాతో ఆడియన్స్ హృదయాలు దోచుకుంది మిల్కీ బ్యూటీ తమన్న. అందం , అభినయంతో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీకి వచ్చే 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇంకా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ తన అద్భుతమైన నటనా ప్రతిభతో మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది.

అలాంటి ఈమె ఇటీవల బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వజ్రాభరణాల రిటైలర్ లో సుదీర్ఘ అనుభవం కలిగిన తన తండ్రి సంతోష్ భాటియాతో కలిసి ఈమె తమన్నా ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ ను స్థాపించింది. తన సొంత నిధులతో నిర్మించిన ఈ బ్రాండ్ ప్రధాన స్టోర్ ముంబై లోని జుహులో ప్రారంభించడం జరిగింది. ఇక అధికారిక తమన్నా ఫైన్ జ్యువెలరీ వెబ్సైట్లో వీటి కలెక్షన్లు కూడా మనకు అందుబాటులో ఉంచింది తమన్నా.

అంతేకాదు తన బ్రాండ్ ఆభరణాలకు తానే మోడల్గా వ్యవహరిస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా బిజినెస్ ఉమెన్ గా మారిన తమన్నా తొలిసారి తన జ్యువెలరీ స్టోర్ లో తొలి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇకపోతే ఈ దీపావళి వేడుకల్లో తమన్న ధరించిన ఔట్ ఫిట్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. రెడ్ కలర్ అనార్కలి కుర్తా ధరించిన ఈమె ఇందులో తాను ధరించిన దుస్తులను మొదలుకొని పెట్టుకున్న జువెలరీ వరకు ప్రతి వస్తువుతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరి ఔట్ఫిట్ తోనే కాదు అవుట్ ఫిట్ ఖరీదుతో కూడా అందరిని విస్మయానికి గురిచేసింది తమన్నా.

తమన్నా తన బ్రాండ్ స్టోర్లో జరుపుకున్న దివాళి వేడుకల్లో ధరించిన ఈ కుర్తాని ఎంబ్రాయిడరీ తో చాలా చక్కగా డిజైన్ చేశారు. కాలర్ నెక్ కలిగిన ఈ అనర్కలి ఎంబ్రాయిడరీ కుర్తా ఖరీదు సుమారుగా రూ.42,000 ఉంటుందని సమాచారం. దీనికి జతగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో దుపట్టా ధరించిన ఈమె ప్రింటెడ్ పలాజో ప్యాంటు ధరించి, తన వస్త్రధారణను పూర్తి చేసుకుంది. ఇక ఈ పలాజో ప్యాంటు సుమారుగా 18 వేల వరకు ఉంటుందని సమాచారం.

ఇక ఈమె ధరించిన వస్తువుల విషయానికి వస్తే .. మియు మియా బ్రాండ్ కు చెందిన ఓవెల్ ఆకారంలో ఉన్న సన్ గ్లాసెస్ ధరించింది. వీటి ధర రూ.51,000 ఉంటుందట. ఇక అలాగే తన చెవి దిద్దులకి అందమైన డైమండ్ హుప్ ఇయర్ రింగ్స్ ధరించింది. వీటిధర సుమారుగా రూ.2,35,000 వరకు ఉండొచ్చు. ఇక అలాగే చేతికి కార్టియర్ లవ్ బ్రాస్లెట్ ధరించింది. దీని విలువ మార్కెట్ ప్రకారం సుమారుగా రూ.6,10,000 ఉంటుందట.

ఇక తన మేకోవర్ను ఫుల్ ఫీల్ చేసుకోవడంలో భాగంగా ఆమె ధరించిన ఎంబ్లిష్డ్ హీల్స్ ధర సుమారుగా 85 వేల వరకు ఉండొచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ దీపావళి వేడుకల్లో భాగంగా తన లగ్జరీ లుక్కుతో అందరి దృష్టిని ఆకట్టుకుంది తమన్నా.